బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (12:35 IST)

బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. పసిడి, వెండి ధరలు డౌన్

బంగారం కొంటున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. ఎందుకంటే పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర తగ్గడంతో... వెండి ధర కూడా బాగా పడిపోయింది.  హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.410 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,330కు క్షీణించింది. 
 
అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.10 తగ్గుదలతో రూ.50,940కు క్షీణించింది. పసిడి ధర తగ్గడంతో వెండి ధర తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,450 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,600కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. 
 
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.26 శాతం తగ్గింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1785 డాలర్లకు పడిపోయింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.49 శాతం తగ్గుదలతో 18.23 డాలర్లకు క్షీణించింది.