ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (14:25 IST)

హమ్మయ్య బంగారం ధర తగ్గింది.. వెండిలో మార్పు లేదు

gold
బంగారం ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ రేట్లలో తగ్గుదల కనిపించింది. ఇది పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగిస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో నిన్నటితో (ఏప్రిల్ 12) పోల్చితే బంగారం ధరలో భారీ మార్పు కనిపించింది. 
 
నిన్న హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ గోల్డ్ రేటు తులానికి 67 వేల 200 రూపాయలు ఉండగా.. నేడు (ఏప్రిల్ 13) 700 రూపాయలు తగ్గి రూ.66,500లకు చేరుకుంది. ఇకపోతే వెండి రేటు కూడా బంగారం ధరలతో పాటు పరుగులు పెడుతోంది. 
 
గత కొన్ని రోజులుగా సిల్వర్ రేట్లు పెరుగుతుండటం చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.89,900లుగా ఉంది.