సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (21:05 IST)

పడిపోయిన బంగారం ధరలు...

కార్తీక మాసం వస్తుందంటే చాలు చాలా వరకు పెళ్లీళ్లు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ మాసంలో బంగారం కొనుగోలు చేసే వారు కూడా ఎక్కువే. అలాంటి వారికి తీపి కబురునందించేలా బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం ధరలతో పోల్చితే మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540, కిలో వెండిపై రూ.560 తగ్గింది. 
 
తగ్గిన ధరలతో బంగారం కొనుగోలు చేసేవారికి కొంత ఉపశమనం కలిగించనున్నాయి. తగ్గిన ధరలతో హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 50,090గా ఉండగా.. కేజీ వెండి ధర రూ.68,795కి చేరింది. అంతేకాకుండా, విజయవాడలో బంగారం ధర రూ.50,090, కేజీ వెండి ధర రూ.68,795 వద్ద కొనసాగుతోంది.