శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (21:26 IST)

వంట నూనె ధరలు తగ్గుముఖం.. ఇంపోర్ట్స్​పై డ్యూటీ డౌన్

Oil
వంట నూనె ధరలతో ఇబ్బందులకు గురైన సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వంట నూనెల ఇంపోర్ట్స్​పై డ్యూటీ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో డ్యూటీ తగ్గింపు నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
అయితే అయితే కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు దిగుమతి తగ్గింపు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ మేరకు కొత్త ధరలు 2021 జూన్ 17 వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్త ధరలను పరిశీలిస్తే.. పామాయిల్‌ ధర 2021 మే 7వ తేదీ నాటికి 142 రూపాయలు ఉండగా, ఇప్పుడు కిలోకు రూ.115 వరకు దిగి వచ్చింది.
 
అలాగే 2021, మే 5వ తేదీ నాటికి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కిలోకు రూ.188 ఉంది. ఇప్పుడు కిలోకు 16శాతం మేర అంటే రూ.157కు పడిపోయింది. 2021, మే 20 నాటికి సోయా ఆయిల్‌ కిలోకు రూ.162 ఉండగా, ముంబైలో కిలోకు రూ.138కి పడిపోయింది. 
 
అలాగే ఆవ నూనె విషయంలో 2021, మే 16 నాటికి రూ.175 ఉండగా, ఇప్పుడు కిలోకు రూ.157కు దిగివచ్చింది. 2021 మే 14 నాటికి వేరుశనగ నూనె ధర రూ.190 ఉండగా, ఇప్పుడు కిలోకు రూ.174 వరకు దిగి వచ్చింది. ఇక మే2 నాటికి వనస్పతి ధర కిలోకు రూ.154 ఉండగా, ఇప్పుడు రూ.141కి దిగి వచ్చింది.