ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (15:41 IST)

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్రం షాక్... ఎందుకో తెలుసా?

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. తక్షణం రూ.10312 కోట్ల రూపాయలను ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. ఇంతకు ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ ఎందుకు కట్టాలనే కదా మీ సందేహం.

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. తక్షణం రూ.10312 కోట్ల రూపాయలను ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. ఇంతకు ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ ఎందుకు కట్టాలనే కదా మీ సందేహం. 
 
గత కొంతకాలంగా ఓఎన్‌జీసీ-రిలయెన్స్ సంస్థల‌కు చెందిన కేజీ డీ 6 బ్లాక్ పై కొంత‌కాలంగా గ్యాస్ వివాదం చెల‌రేగుతోంది. అయితే, రిలయన్స్ సంస్థకు కృష్ణా గోదావరి బేసిన్‌ (కేజీ బేసిన్)లో గ్యాస్ బావులు ఉన్నాయి. వీటి పక్కనే ఓఎన్‌జీసీ బావుల కూడా ఉన్నాయి. అయితే, రిలయన్స్ సిబ్బంది.. ఓఎన్జీసీ బావుల నుంచి చడీచప్పుడు కాకుండా గ్యాస్‌‌ని తోడేశారు. 
 
దీనిపై విచార‌ణ జ‌రిపిన భార‌త‌ మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీ ఉత్ప‌త్తి చేసిన ఓఎన్‌జీసీ గ్యాస్ విలువ గురించి తెలుపుతూ 1 బిలియన్ డాల‌ర్లు దాదాపు రూ.​6652.75 కోట్లుగా పేర్కొంది. అనంత‌రం త‌న నివేదిక‌ను ప్ర‌భుత్వానికి ఇవ్వడంతో.. కేంద్రం పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిహారం 1.55 బిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 10,312 కోట్ల రూపాయ‌లుగా ఉంది.