గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (08:12 IST)

పడిపోయిన వంట నూనెల ధరలు.. కారణం అదే?

వంట నూనెల ధరలు తగ్గాయి. కేంద్రం నూనెలపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని(బీసీడీ)ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. 2022 మార్చి వరకు ఇది అమల్లో ఉంటుంది. దీంతో వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. బీసీడీ తగ్గడం ద్వారా  దేశీయ విపణిలో సరఫరా పెరిగి, ధరలు తగ్గుతాయని అంచనా. కొత్త రేటు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. 
 
వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. సోమవారం కిలో వేరుసెనగ నూనె ధర రూ.181.48; ఆవాల నూనె రూ.187.43; వనస్పతి రూ.138.5; సోయాబీన్‌ నూనె రూ.150.78; పొద్దుతిరుగుడుపువ్వు నూనె రూ.163.18, పామాయిల్‌ రూ.129.94గా ఉన్నాయి. శుద్ధి చేసిన పామాయిల్‌ను లైసెన్సు లేకుండా 2022 డిసెంబరు వరకు దిగుమతి చేసుకోవచ్చని సోమవారం ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే.