Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జీఎస్టీ: 66 వస్తువులపై పన్ను రేట్లు తగ్గింపు.. రూ.100 కంటే తక్కువ ఉన్న సినిమా టిక్కెట్లపై?

మంగళవారం, 11 జులై 2017 (10:19 IST)

Widgets Magazine

వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) పదహారవ సమావేశం వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 66 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. పరిశ్రమలో కీలక వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పన్ను శాతాన్ని సవరించామని తెలిపారు. ఈ క్రమంలో 66 వస్తువులపై పన్ను రేట్లను సవరించామని తెలిపారు. 
 
జీడిపప్పుపై 12 నుంచి 5 వరకు, ప్యాకింగ్‌ చేసిన ఆహారం, పండ్లు, కాయగూరలు, పచ్చళ్లు, టాపింగ్స్‌, ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌, సాస్‌లపై 18 నుంచి 12శాతం,  స్కూల్‌ బ్యాగ్స్‌ 28 నుంచి 18శాతం, ఎక్సర్‌సైజ్‌ బుక్స్‌ 18 నుంచి 12శాతం, కలరింగ్‌ బుక్స్‌ 12 నుంచి 0శాతం, అగర్‌బత్తీలపై 12 నుంచి 5శాతం, డెంటల్‌ వాక్స్‌ 28 నుంచి 8 శాతం, ఇన్సులిన్‌ 12 నుంచి 5శాతం, ప్లాస్టిక్‌ బెడ్స్‌ 28 నుంచి 18 శాతం తగ్గించినట్లు జైట్లీ ప్రకటించారు. ఇంకా ప్రీకాస్ట్‌ కాన్సన్‌ట్రేట్‌ పైపులు 28 నుంచి 18శాతం,  స్పూన్లు, ఫోర్క్‌లు (కట్లరీ) 18 నుంచి 12శాతం, ట్రాక్టరు విడిభాగాలపై 28 నుంచి 18శాతం, కంప్యూటర్‌ ప్రింటర్లపై 28 నుంచి 18 శాతం తగ్గించారు. 
 
ఇక సినిమాలపై 28శాతం పన్ను విధించడంతో తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మధ్యే మార్గాన్ని ఎంచుకుంది. రూ.100 కంటే తక్కువ ఉన్న టిక్కెట్ల పన్ను శాతాన్ని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. రూ.100 దాటిన టికెట్లపై మాత్రం 28శాతం పన్ను కొనసాగుతుంది. చాలా రాష్ట్రాలు తమ ప్రాంతానికి చెందిన భాషల్లో తీసిన సినిమాకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చాయి. ఇప్పుడు వాటికి కేంద్రం నుంచి ఎటువంటి మినహాయింపు ఉండదు. రాష్ట్రాలు డైరెక్ట్‌ బెన్ఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఇవ్వాలనుకుంటే ఆ రాష్ట్రాలే స్థానిక చిత్రాలకు జీఎస్టీని రిఫండ్‌ చేయాల్సి ఉంటుందని అని ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

మీకు నడపటం చేతకాక మాంసాహారం బంద్ చేస్తారా మహరాజా

ఉరుము ఉరిమి మంగలం మీద పడిందంటే ఇదేమరి. ఎయిరిండియా మహారాజావారికి మహా కోపం వచ్చేసింది. ...

news

ఆలస్యంగా రావడంలో ఆ రైలు ఫస్ట్...

దేశంలో నడిచే రైళ్లు సమయానికి రావు అనే అపవాదు ఉంది. దీన్ని మరింతగా రుజువు చేసేలా ఓ ట్రైన్ ...

news

పెట్రోలు, డీజిల్ కార్లు కొనకండి స్వాములూ.. 750 కిలోమీటర్లు నడిచే సోలార్ కార్లొస్తున్నాయ్

జీఎస్టీ పుణ్యమా అని కార్లధరలు విపరీతంగా తగ్గుతున్నాయని పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు ...

news

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా ఫౌండర్ ఇనిస్టిట్యూట్

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా ఫౌండర్ ఇనిస్టిట్యూట్ నిలుస్తోంది. ముఖ్యంగా ...

Widgets Magazine