సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 మే 2023 (18:50 IST)

రూ. 50,000 కోట్లు దాటిని హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్

image
హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌(ఎన్‌పీఎస్)లో భాగంగా పని చేస్తున్న అత్యంత వేగంగా దిగ్గజ పెన్షన్ ఫండ్ మేనేజర్ మే 15, 2023 నాటికి తన ఆధ్వర్యంలో అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) నిధుల విషయంలో రూ. 50,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. 2023లో ప్రారంభించినప్పటి నుంచి, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పూర్తి సబ్సిడరీ అిన కంపెనీ, అత్యంత వేగంతో అభివృద్ధి సాధించింది (కింది టేబుల్ చూడండి.) 33 నెలల కాలంలో ఏయూఎం పరిమాణం 400 శాతం పెరిగి, జూలై 2020లో సాధించి రూ. 10,000 కోట్ల నుంచి భారీగా వృద్ధి సాధించింది.
 
హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ అనేది ఇండియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దిగ్గజ పెన్షన్ మేనేజర్, ఇది రిటైల్ మరియు కార్పొరేట్ ఎన్‌పీఎస్ విభాగాలలో, అత్యధిక సబ్‌స్క్రైబర్స్ సంఖ్యvg (1 మే 2023 నాటికి 15,00,000+) కలిగి ఉంది. ఈ మైలురాయిని అందుకోవడంపై మాట్లాడుతూ, హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్రీరామ్ అయ్యర్, “ఇది మాకు చాలా గర్వకారణమైన సమయం. రూ.50,000 కోట్లు ఏయూఎం మైలురాయిని దాటినందుకు మేము సంతోషిస్తున్నాము, అలాగే ఇది మా బలమైన ఉనికిని ధృవీకరిస్తుంది. మేము ఈ సంవత్సరం పది (10) సంవత్సరాల వ్యాపారాన్ని పూర్తి చేసుకుంటూ ఉండడంతో, ఈ విజయం మరింత ముఖ్యమైనది. ఈ మైలురాయి మా గౌరవనీయమైన చందాదారులు మా సంస్థపై ఉంచిన నమ్మకానికి ప్రతిబింబం. మా సబ్‌స్క్రైబర్‌లు, కార్పొరేట్ పార్టనర్స్, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీలు) మరియు డిస్ట్రిబ్యూటర్స్ మాపై చూపిన విశ్వాసం, నమ్మకానికి మరియు కంపెనీని సంవత్సరాలుగా ఎదగడానికి సహకరించినందుకు మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
 
పని చేసే ప్రతి వ్యక్తికి పదవీ విరమణ తర్వాత తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ఒక మార్గం అవసరం. రిటైర్మెంట్ ప్రణాళిక ప్రక్రియలో ఆర్థిక ఉత్పత్తిగా ఎన్‌పీఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఉన్నతమైన రాబడి, ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలు ఇంకా తక్కువ ఛార్జీలు అనేవి కస్టమర్లు పెరగడానికి దోహదం చేస్తాయి. మా ఏయూఎం స్థాయి థ్రెషోల్డ్ రూ. 50,000 కోట్లు కావడంతో, మా సబ్‌స్క్రైబర్‌ల కోసం ప్రభావిత ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జెస్ మరింత తగ్గుతాయి, దీనితో ప్రొడక్ట్ మరింత అందుబాటులో లభిస్తుంది. ఎక్కువ మంది భారతీయులు ఈ ఉత్పత్తిని ఎంపిక చేసుకుంటారని, తద్వారా వారి బంగారు సంవత్సరాలను సురక్షితంగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.