మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 12 మే 2021 (19:50 IST)

హౌసింగ్‌ డాట్‌ కామ్‌ యొక్క సిటీ హెల్త్‌ కార్డ్‌లో హైదరాబాద్‌ ఇప్పటికీ 5వ ర్యాంక్‌లో ఉంది

ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు డెలివరీ వ్యవస్ధల దగ్గరకు వచ్చేసరికి, భారతదేశంలో అతి ప్రధానమైన ఎనిమిది నగరాల జాబితాలో హైదరాబాద్‌ ఐదవ స్థానంలో ఉందని సుప్రసిద్ధ ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హౌసింగ్‌ డాట్‌ కామ్‌ నివేదికలో వెల్లడైంది. ఇటీవలనే హౌసింగ్‌ డాట్‌ కామ్‌ విడుదల చేసిన ‘భారతదేశంలో ఆరోగ్యసంరక్షణ స్థితి, ఆరోగ్య సంరక్షణ దృష్టి కోణంలో భారతీయ నగరాలు’నివేదికలో భాగంగా ఎలారా టెక్నాలజీస్‌కు సొంతమైన ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్ధ దేశంలో అతి పెద్ద ఎనిమిది నగరాలకు రేటింగ్స్‌ను తమ హౌసింగ్‌ డాట్‌ కామ్‌ యొక్క ‘సిటీ హెల్త్‌ కార్డ్‌ జాబితా’లో భాగంగా అందజేసింది.
 
హౌసింగ్‌ డాట్‌ కామ్‌ యొక్క సిటీ హెల్త్‌ కార్డ్‌ జాబితాలో పూనె అగ్రస్థానంలో నిలువగా అనుసరించి అహ్మదాబాద్‌, బెంగళూరు మరియు ముంబైలు ద్వితీయ, తృతీయ మరియు నాల్గవ స్థానాలలో నిలిచాయి. చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లు వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలలో ఈ జాబితాలో నిలిచాయి.
 
గాలి నాణ్యత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల పరంగా ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ, నీటి సరఫరా పరంగా ఒత్తిడి కారణంగా నీటి సరఫరా, నీటి లభ్యత తక్కువ ఉండటం వంటి అంశాలు ర్యాంకింగ్‌ పరంగా వెనక్కి వెళ్లేలా చేశాయని ఈ నివేదిక వెల్లడించింది.
 
ఈ నగరంలో ప్రతి 1000 మంది ప్రజలకు 2.9 ఆస్పత్రి బెడ్స్‌ మాత్రమే ఉన్నాయి. మొత్తంమ్మీద 86 లక్షల మంది జనాభాకు 24000-26000 పడకలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ ఆస్పత్రుల పడకలు కూడా కలిసి ఉన్నాయి. ఇక మహమ్మారి కారణంగా అదనంగా జోడించిన పడకలను ఈ నివేదికలో జోడించలేదు అని ఆ నివేదికలో వెల్లడించారు. ఆరోగ్య సంరక్షణ పరంగా, ఈ నగరంలో ఒకే తరహా అభివృద్ధిని అనుసరిస్తుంది. నగరపు పశ్చిమ మరియు సెంట్రల్‌ సబ్‌ అర్బన్‌ ప్రాంతాలలోనే అభివృద్ధి కేంద్రీకృతమై ఉంది.
 
హౌసింగ్‌ డాట్‌ కామ్‌ సిటీ హెల్త్‌కార్డ్‌‌ను దేశంలోని అతి ప్రధానమైన ఎనిమిది నగరాలను తీసుకుని సిద్ధం చేయడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్‌ అందించడానికి అతి ముఖ్యమైన పారామీటర్లు అయినటువంటి- వెయ్యి మందికి ఉన్న ఆస్పత్రి పడకల సంఖ్య; గాలి నాణ్యత, నీటి నాణ్యత మరియు పారిశుద్ధ్య వసతులు, ఘన వ్యర్థాల నిర్వహణ, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌, పురపాలక పనితీరు సూచిక మరియు సుస్థిర కార్యక్రమాలు ఉన్నాయి.
 
‘‘నాణ్యమైన హౌసింగ్‌ అనేది ఆరోగ్యంలో అంతర్భాగంగా ఉంటుంది. రాష్ట్రాలు తప్పనిసరిగా మరిన్ని సంస్కరణలను చేయడం ద్వారా అత్యధిక సంఖ్యలో ప్రజలకు అందుబాటు ధరల్లో గృహాలు లభిస్తాయన్న భరోసా కలిగించాలి. అది ఆరోగ్య ప్రమాదాల బారిన పడకుండా నివారించేందుకు సైతం తోడ్పడుతుంది. మెరుగైన ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి ఆలోచనాత్మక మీడియం టర్మ్‌ ప్రణాళిక కావాలి. అది అమలు చేసేందుకు తగిన సమయం కూడా అవసరం పడుతుంది. రాష్ట్రాలు తక్షణమే స్టాంప్‌డ్యూటీ తగ్గించడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా తమ పౌరులకు మెరుగైన రక్షణను ఆరోగ్య ప్రమాదాల నుంచి అందుబాటు ధరలలో గృహాల లభ్యత ద్వారా అందించాల్సి ఉంది. దానితో పాటుగా అన్ని వసతులూ కలిగిన అత్యుత్తమ కమ్యూనిటీ లివింగ్‌ను సైతం అందించాల్సి ఉంటుంది’’ అని శ్రీ మణి రంగరాజన్‌, గ్రూప్‌ సీఓఓ, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.
 
ఇక్కడ మననం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ 2020లో భారతదేశంలో 111 నగరాలలో  నివసించడానికి అనువైన అత్యుత్తమ నగరాలలో 24వ స్థానంలో హైదరాబాద్‌ ఉంది. ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ ఫార్మా కేంద్రంగా ఈ నగరం ఖ్యాతి గడించింది. ఇక్కడ అతి ప్రధానమైన ఫార్మా సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో పాటుగా వ్యాక్సిన్‌లను తయారుచేస్తున్నాయి. అలాగే వీటిని ఎగుమతి చేయడానికి అంతర్జాతీయ కనెక్టివిటీ కూడా ఇక్కడ ఉంది.
 
ఫార్మాతో పాటుగా ఐటీ పరిశ్రమ కూడా హైదరాబాద్‌లో గణనీయంగా వృద్ధి చెందుతుంది. వ్యాపార అనుకూల విధానాలైనటువంటి టీఎస్-ఐపాస్‌, తెలంగాణా స్టేట్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌ఐఐసీఎల్‌) సింగిల్‌ విండో క్లియరెన్స్‌కు అనుమతిస్తున్నాయి. ఈ నివేదికలో తమ ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడంలో జాతి సంసిద్ధతకు సంబంధించిన కోణాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలో ప్రజాఆరోగ్యంపై అతి తక్కువగా ఖర్చు చేస్తోన్న దేశాల సరసన ఇండియా ఉంది. ఇక్కడ ఆరోగ్య సేవల కోసం ఎవరికి వారు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకోవాలి.
 
ఈ నివేదిక ప్రకారం 2018లో తమ జీడీపీలో కేవలం 3.5% మాత్రమే ఆరోగ్య సంరక్షణపై భారతదేశం ఖర్చు చేసింది. ఇదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాలైన యుఎస్‌, యుకె, జపాన్‌, జర్మనీ, కెనడాలు తమ జీడీపీలో 10-18% ఖర్చు చేశాయి. సిటీ హెల్త్‌ కార్డ్‌ మెథడాలజీ కోసం 100 కన్నా ఎక్కువ పడకలు కలిగిన ఆస్పత్రులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు.