ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2016 (09:35 IST)

ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ చివరి పరపతి విధాన సమీక్ష.. వడ్డీరేట్లు తగ్గిస్తారా?

ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌ వ్యవస్థల ముఖ చిత్రాన్ని మార్చిన రఘురాం రాజన్‌, ఆర్‌బీఐ గవర్నరుగా తన చివరి పరపతి విధాన సమీక్షను మంగళవారం నిర్వహించనున్నారు. వడ్డీరేట్లు తగ్గిస్తారని కొందరు నిపుణులు, అక్టోబరుకు వాయ

ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌ వ్యవస్థల ముఖ చిత్రాన్ని మార్చిన రఘురాం రాజన్‌, ఆర్‌బీఐ గవర్నరుగా తన చివరి పరపతి విధాన సమీక్షను మంగళవారం నిర్వహించనున్నారు. వడ్డీరేట్లు తగ్గిస్తారని కొందరు నిపుణులు, అక్టోబరుకు వాయిదా వేసే అవకాశం ఉందని మరికొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో, దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై రాజన్‌ వెల్లడించే సంకేతాల కోసం ఆర్థికవేత్తలు, మదుపర్లు ఎదురు చూస్తున్నారు. వారు ప్రధానంగా కొన్ని అంశాలపై దృష్టి సారిస్తున్నారు. వడ్డీ రేట్లు ఈసారి యథాతథంగా ఉంచొచ్చన్న అంచనాలు అధికంగా ఉన్నందున భవిష్యత్‌ రేట్ల కోతపై ఇచ్చే సంకేతాలు కీలకం అవుతాయి. ఆర్‌బీఐతో సంప్రదింపుల అనంతరం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 4 శాతంగా (+/- 2%) గత వారం ప్రభుత్వం నోటిపై చేసింది. ప్రస్తుతం రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరుగుతుండగా.. టోకు ధరల ద్రవోల్బణం ప్రతి ద్రవ్యోల్బణ స్థితి నుంచి సాధారణానికి వచ్చేసింది. 
 
ద్రవ్యోల్బణ నియంత్రణ, లక్ష్య సాధనకు ఆర్‌బీఐ ప్రణాళికపై దృష్టి సారించొచ్చు. 23వ గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన రాజన్‌ పదవీకాలం సెప్టెంబరు 4న ముగియనుంది. కొత్త గవర్నరు ఎవరనే విషయమై ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. రాజన్‌ లాంటి దక్షత కలిగిన వ్యక్తికే ఆర్‌బీఐ పగ్గాలు అప్పజెప్పాలని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థల నుంచి మాజీ గవర్నర్ల వరకు ప్రభుత్వానికి సూచిస్తున్న నేపథ్యంలో.. ఆయన ఏమైనా వ్యాఖ్యలు చేస్తారేమోనని చూస్తున్నారు.