బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 9 సెప్టెంబరు 2024 (20:39 IST)

వేదాంత జింక్ సిటీ హాఫ్ మారథాన్ ప్రారంభోత్సవాన్ని ఆవిష్కరించిన హిందూస్థాన్ జింక్

image
సెప్టెంబర్ 29,2024న ప్రారంభమయ్యే వేదాంత జింక్ సిటీ హాఫ్ మారధాన్ ను ప్రకటించడం ద్వారా గ్రామీణ పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడటంలో హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈ: హింద్ జింక్) పెద్ద చర్యను చేపట్టింది. ఈ గొప్ప కార్యక్రమానికి చిహ్నంగా, కంపెనీ అధికారిక మారథాన్ పోస్టర్ ను విడుదల చేసింది, జింక్ సిటీగా పేరు పొందిన ఉదయ్ పూర్ లో అందమైన దృశ్యాలను ఈ పోస్టర్  ప్రధానంగా చూపించింది మరియు #రన్ ఫర్ జీరో హంగర్ వంటి గొప్ప లక్ష్యం ద్వారా గ్రామీణ పోషకాహార లోపంతో పోరాడే కీలకమైన ఇతివృత్తానికి ప్రాధాన్యతనిచ్చింది. ప్రశాంతమైన ఫతే సాగర్ సరస్సు ద్వారా  ప్రేరేపణ పొందిన ఆకర్షణీయమైన నీలి రంగు అధికారిక రేస్-డే జెర్సీ కూడా ఉదయ్ పూర కలక్టర్ శ్రీ అరవింద్ పోస్వాల్, ఉదయ్ పూర్  పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ శ్రీ అజయ్ పాల్ లాంబా, హిందూస్థాన్ జింక్ సిఈఓ మరియు మారథాన్ ను ఆరాధించే శ్రీ అరుణ్ మిశ్రా, మరియు ఎనీబడీ కెన్ రన్ (ఏబిసిఆర్) స్థాపకుడు డాక్టర్ మనోజ్ సోనీల సమక్షంలో విడుదలైంది.


హిందూస్థాన్ జింక్ నిర్వహించే ద వేదాంత జింక్ సిటీ హాఫ్ మారథాన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారథాన్స్ (ఎఐఎంఎస్) మరియు డిస్టెన్స్ రేసెస్ యొక్క అధికారిక సభ్యుడు, ఎఐఎంఎస్ ధృవీకరణను ఎంతో గర్వంగా కలిగి ఉంది. భారతదేశపు అత్యంత అందమైన మారథాన్ గా పేరు పొందిన ఇది ప్రశాంతమైన ఫతే సాగర్ సరస్సు మరియు అద్భుతమైన ఆరావళి పర్వత శ్రేణిల మార్గం వెంట కొనసాగుతున్న నేపథ్యంలో ఇది  తప్పనిసరిగా అసాధారణమైన అనుభవం అందిస్తుంది. అంతర్జాతీయ రన్నింగ్ క్యాలండర్ లో భాగంగా ఉన్న దీనిలో పాల్గొంటున్నవారు ఉదయ్ పూర్ సుసంపన్నమైన వారసత్వం అనుభవిస్తారు, మహారాణా ప్రతాప్ స్మారక్, సహేలియాన్ కి బరి, గౌరవనీయమైన నీముచ్ మాతా మందిర్ కొండ వంటి దిగ్గజ ల్యాండ్ మార్క్స్ వెంట కొనసాగుతారు. మారథాన్ ఈ మంత్రముగ్థులను చేసే నగరంలోని అత్యంత మనోహరమై దృశ్యాలలో ఒకటైన శరత్కాలం రాకను కూడా సంబరం చేస్తోంది.

కార్యక్రమానికి మరింత అందం చేకూరుస్తూ, మారథాన్ లోగో యొక్క చిత్రం కూడా 1,400 రూబిక్ క్యూబ్ ముక్కలు ఉపయోగించి తయారు చేయబడింది. ఈ కళాత్మకమైన పనిని హిందూస్థాన్ జింక్ ఉద్యోగి, జాతీయ స్థాయిలో ప్రముఖులచే ఆరాధించబడిన కళాత్మక పనులు ప్రదర్శించే సుమీత్ ద్విబేడి రికార్డ్ సమయంలో 6 గంటల్లో పూర్తి చేసారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సాండ్ కళాకారుడు సాండ్ కౌశిక్ ఉదయ్ పూర్ యొక్క గొప్ప చరిత్ర మరియు మారథాన్ మిషన్ ను ఇసుకతో చిత్రీకరించి  ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అధికారిక మారథాన్ పోస్టర్ మరియు రేస్-డే జెర్సీలు ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించబడ్డాయి. హాజరైన వారు  నగర దిగ్గజపు ఫతే సాగర్ సరస్సు కు చిహ్నంగా నిలిచిన ప్రశాంతమైన నీలి రంగును ధరించారు.

హిందూస్థాన్ జింక్ ఛైర్ పర్శన్, ప్రియా అగర్వాల్ హెబ్బర్, వేదాంత జింక్ సిటీ హాఫ్ మార్థన్ ప్రారంభోత్సవం గురించి వర్ట్యువల్ గా తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఆమె గ్రామీణ పోషకాహార లోపం పరిష్కరించవలసిన ప్రాధాన్యతను తెలియచేసారు మరియు ప్రజలను సన్నిహితం చేసే మారథాన్స్ శక్తిని వివరించారు.

హిందూస్థాన్ జింక్ ఛైర్ పర్శన్ ప్రియా అగర్వాల్ హెబ్బర్ వేదాంత జింక్ సిటీ హాఫ్ మారథాన్ ప్రారంభోత్సవంపై వర్ట్యువల్ గా ఆనందం వ్యక్తం చేసారు. గ్రామీణ పోషకాహారంతో పోరాడే అవసరానికి ఆమె ప్రాధాన్యతనిచ్చారు మరియు ప్రజలను ఐక్యం చేయడంలో మారథాన్స్ కు గల శక్తిని ఆమె వివరించారు.

కార్యక్రమం అవధి అంతటా, వివిధ అధికారులు ఉదయ్ పూర్ వారసత్వం, పరుగు ప్రాధాన్యత, జింక్ పోషకం సమృద్ధి ఆహారం ద్వారా గ్రామీణ పోషకాహార లోపంతో పోరాడవలసిన కీలకమైన లక్ష్యం గురించి మాట్లాడారు. ఉదయ్ పూర్ జిల్లా కలక్టర్, శ్రీ అరవింద్ పోస్వాల్  కార్యక్రమం గురించి తన ఆనందాన్ని వ్యక్తం చేసారు మరియు ఉదయ్ పూర్ సాంస్కృతిక వ్యవస్థలో మారథాన్ మాత్రమే లేదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ మారథాన్ ఉదయ్ పూర్ హోదాను పెంచుతుందని మరియు భారతదేశపు అత్యంత రమణీయమైన మార్గంలో పాల్గొనడానికి రన్నర్స్ కు అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్, ఉదయ్ పూర్, శ్రీ అజయ్ పాల్ లాంబా కార్యక్రమం కోసం తన మద్దతును వ్యక్తం చేసారు మరియు ఈ మారథాన్ ను ప్రారంభించడం ఉదయ్ పూర్ ను ప్రపంచ మ్యాప్ పై ఉంచుతుందని వ్యక్తం చేసారు. ఈ మారథాన్ ఉదయ్ పూర్ ను మరింత ఆకర్షణీయం చేస్తుందని, మరియు నగరాభివృద్ధిలో ఇది అతి పెద్ద చర్య అని ఆయన అన్నారు. ఇది ప్రతి ఒక్కరు శారీర దారుఢ్యం కలిగి ఉండి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా తరలడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుందని ఆయన అన్నారు.

హిందూస్థాన్ జింక్ సీఈఓ అరుణ్ మిశ్రా తన ఉత్సాహాన్ని తెలియచేసారు, “మారథాన్స్ అనేవి విశ్రాంతి తీసుకోవడానికి, పనులకు విరామం ఇచ్చి ప్రతి మలుపులో కొత్త గాథలను కనుగొనడానికి ఒక అద్భుతమైన మార్గంగా వర్ణించారు. దేశవ్యాప్తంగా నాకు గల మారథాన్ అనుభవాలలో, నేను గొప్ప ప్రజలను కలిసాను మరియు ప్రతి నగరం యొక్క కొత్త అంశాలను తెలుసుకున్నాను. ద వేదాంత జింక్ సిటీ హాఫ్ మారథాన్ గ్రామీణ పోషకాహార లోపాన్ని నిర్మూలించాలని గొప్ప లక్ష్యం కోసం ప్రపంచం నలు మూలల నుండి పాల్గొంటున్న వారిని ఐక్యం చేస్తుంది. ఉదయ్ పూర్ నగర సుసంపన్నమైన సాంస్కృతిక చరిత్ర ద్వారా పరుగులు తీస్తూ,  మన హృదయాల్లో గ్రామీణ పోషకాహార లోపంతో పోరాడాలనే మిషన్ తో, నేను జింక్ నగరంలో పరిగెత్తడానికి ఆతృతగా ఉన్నాను.”