గిడ్డంగుల లావాదేవీల్లో ఏటేటా ప్రాతిపదికన 128% వృద్ధి నమోదు చేసిన హైదరాబాద్
అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ఇండియా వేర్ హౌసింగ్ మార్కెట్ రిపోర్ట్ -2022 ప్రకారం గిడ్డంగుల (వేర్-హౌస్) లావాదేవీల్లో హైదరాబాద్ 2022 ఆర్థిక సంవత్సరంలో 5.4 మిలియన్ చ.అ.ల లావాదేవీలను నమోదు చేసింది. 2021 ఆర్థిక సంవత్సరం నాటి 2.36 మిలియన్ చ.అ.లతో పోలిస్తే, ఏటేటా ప్రాతిపదికన 128% వృద్ధి నమోదు చేసింది. ప్రధానంగా 3పిఎల్ విభాగంలో పెరిగిన వృద్ధి కారణంగా ఈ వృద్ధి చోటు చేసుకుంది. పలు రిటైల్, ఇ- కామర్స్ కంపెనీలు తమ లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ కార్యకలాపాలను 3పిఎల్ సంస్థలకు అవుట్ సోర్సింగ్ కు ఇచ్చేందుకు మొగ్గచూపడంతో 3పిఎల్ సంస్థలచే హైదరాబాద్ లో వేర్ హౌసింగ్ కు డిమాండ్ బాగా పెరిగింది. 3పిఎల్ సేవలకు డిమాండ్ 2021 ఆర్థిక సంవత్సరం నాటి 24%తో పోలిస్తే, 2022 ఆర్థిక సంవత్సరంలో 31 శాతానికి పెరిగింది.
లావాదేవీల పరిమాణాన్ని పరిశ్రమ వారీగా విభజించి చూస్తే, 3పిఎల్ విభాగం గిడ్డంగులకు సంబంధించి అతిపెద్ద డిమాండ్ చోదక శక్తిగా ఉంది. 3 పిఎల్ సేవలకు డిమాండ్ 2021 ఆర్థిక సంవత్సరం నాటి 24%తో పోలిస్తే, 2022 ఆర్థిక సంవత్సరంలో 26 శాతానికి పెరిగింది. మొత్తం మీద చూస్తే మాత్రం, రిటైల్ రంగం అత్యధిక వృద్ధిని సాధించింది. 2021 ఆర్థిక సంవత్సరం లో ఉండిన 0% నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో 14 శాతానికి పెరిగింది. ఇతర రంగాలకు వస్తే, ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీడీ మినహా అన్ని తయారీ సంస్థలు కూడా వృద్ధిని చవిచూసింది. ఈ విభాగంలో వృద్ధి 2021 ఆర్థిక సంవత్సరంలో 2 శాతంగా ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 16 శాతానికి పెరిగింది. పెయింట్, ఫార్మా పరిశ్రమల నుంచి గణనీయ లావాదేవీలు చోటు చేసుకున్నాయి.