బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2020 (18:22 IST)

మింత్రా నూతన క్యాంపెయిన్‌లో స్టార్ దంపతులు చైతన్య- సమంత అక్కినేని

అందరికీ అత్యంత ప్రియమైన సెలబ్రిటీ దంపతులు చైతన్య-సమంత అక్కినేని, మింత్రా ప్రత్యేక పండుగ ప్రచార జాగృతికి శక్తిని నింపి, దక్షిణాదిలో వారి లక్షలాది మంది అభిమానులను చేరుకోనున్నారు. అందంగా కనిపించే ఈ దంపతులు నిజ జీవితంలోని అన్యోన్యతను సంభ్రమించే ఈ వాణిజ్య ప్రచార చిత్రం మింత్రా అంతర్జాతీయ, స్థానిక బ్రాండ్ల నుంచి పండుగ ఫ్యాషన్‌కు విస్తృత శ్రేణిలో పూర్తి కుటుంబానికి కలెక్షన్‌ను ఈ పండుగ ఉత్సాహంతో ప్రదర్శించనుంది.
 
ఈ వాణిజ్య ప్రచార చిత్రం మింత్రాకు ఉన్న ప్రజాదరణను మరింత ఉత్తేజించనుండగా, ఈ పండుగ సీజన్ అలానే ఆ తరువాత కూడా షాపింగ్‌కు ప్రాధాన్యతల కేంద్రంగా చేయనుంది. ఈ పండుగకు మరొక సంప్రదాయం ఏమంటే మనకు ప్రియమైన వారికి బహుమతులు అందించడం కాగా, అది ఈ ఏడాది సంబరాలు మరియు సామాజిక కార్యక్రమాలు వర్చువల్ స్వరూపం పొందడంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
 
ఈ ప్రచార జాగృతి మింత్రాలో ఏ కుటుంబానికి అయినా పండుగ షాపింగ్ అవసరాలను అనుకూలకరంగా అందించే సామర్థ్యం వైపు దృష్టిని కేంద్రీకరించి, కేవలం సంప్రదాయిక దుస్తులే కాకుండా బాలల ఫ్యాషన్‌తో కూడిన వివిధ విభాగాలను కలిగి ఉంది. మింత్రా దీపావళి పండగ కోసం అక్టోబరు 30 నుంచి నవంబరు 14 వరకు అత్యుత్తమ పండుగ డీల్స్ మరియు ఆఫర్లను అందించనుంది.
 
ఈ వాణిజ్య చిత్రం గురించి: ఈ చిత్రం బహుమతుల సంతోషాన్ని మరియు ప్రియమైన వారితో పండుగ సంప్రదాయాల గురించి వివరిస్తోంది. ఇందులో చైతన్య ప్రశాంతంగా పుస్తకాన్ని చదువుకుంటూ ఉండగా, సమంత అక్కడకు నడుచుకుని వస్తుంది మరియు తమాషాగా చైతన్యను ఆటపట్టిస్తూ పండుగ షాపింగ్ మొత్తాన్ని తనకే వదిలివేయాలని కోరుతుంది. చైతన్య ముసిముసిగా నవ్వుకుంటూ మరియు విశ్వాసంతో మింత్రా యాప్ ఓపెన్ చేస్తారు, అది సమంతాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అనంతరం చైతన్య యాప్‌ను ఆపకుండా స్ర్కోల్ చేస్తుంటారు మరియు అతని మరియు సమంత కుటుంబంలోని వివిధ సభ్యులకు బహుమతులను అందించవలసిన అగ్రగామి బ్రాండ్ల జాబితాను తయారు చేసుకుంటారు. కాగా, అందులో ఎథినిక్ వేర్ మరియు క్యాజువల్ వేర్ కూడా ఉంటాయి.
 
అనంతరం దంపతులు చైతన్య తల్లికి అత్యంత అందమైన హ్యాండ్ క్రాఫ్ట్ చీరను ఎంపిక చేస్తారు, సమంత మింత్ర యాప్‌లో బాలల దుకాణం వైపు సాగుతారు. ఈ వాణిజ్య చిత్రం బాలలు ధరించిన సుందరమైన దుస్తులను ఆసక్తితో చూస్తున్నప్పుడు తేలికపడిన మనసుతో షాపింగ్ పూర్తి చేస్తారు మరియు ‘ఇంకే ఆలోచనలు పెట్టుకోవద్దు, ఓకే!’’ అంటుంది. ఈ నేపథ్య ధ్వని వీక్షకులకు వారి జీవితంలోని అద్భుత క్షణాలను మింత్ర రూపొందించిన స్టైల్‌లో పొందేందుకు సలహా ఇస్తుంది.
 
ఈ సందర్భం గురించి మింత్ర హెడ్ ఆఫ్ మార్కెటింగ్ హరీశ్ నారాయణన్ మాట్లాడుతూ, ‘‘చైతన్య మరియు సమంత అక్కినేని దక్షిణ భారతదేశంలోని శక్తియుత తారా దంపతులు కాగా, వారి వ్యక్తిగత స్టైల్ మరియు వీక్షకులతో అనుసంధానమయ్యే వారి సామర్థ్యం మార్కెట్టులో మింత్రా మింత్ర బాంధవ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వారి ఆకర్షణీయమైన ఆన్-స్క్రీన్ అనుబంధం, చక్కని గుర్తింపు పొందింది, సదృఢమైన మరియు స్నేహభావం కలిగిన కుటుంబ కేంద్రితమైన మరియు వీక్షకులకు విశ్వసనీయత పొందింది.
 
ఈ దంపతులు వారి అభిమానులను తక్షణమే ఆకట్టుకునే గుణాన్ని కలిగి ఉన్నారు. సమంత మా బ్రాండ్ రాయబారిగా సమర్థవంతంగా వినియోగదారుల క్రియాశీలతకు నేతృత్వాన్ని వహించారు మరియు మింత్ర బ్రాండ్ నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందించారు. ఈ స్టార్ దంపతులు నూతన వాణిజ్య చిత్రం మింత్రలో పండుగ ప్రచార జాగృతికి అదనపు పొరగా పని చేయనుందని’’ పేర్కొన్నారు.
 
ఈ బ్రాండ్ ప్రచార జాగృతి గురించి చైతన్య మరియు సమంత అక్కినేని మాట్లాడుతూ ‘‘మన విలువలు మరియు సంప్రదాయాలు మన కుటుంబాలతో పెనవేసుకుని ఉంటాయి మరియు మేము ప్రత్యేక సందర్భాలను వేడుక చేసుకునేందుకు ఇష్టపడతాము, పండుగలు వాటిలో ఒకటి. మింత్రతో మా భాగస్వామ్యం తదుపరి పండుగ సీజన్‌ను బంధుమిత్రులతో స్టైల్‌గా ఆచరించేలా ఉంటుంది! అత్యాధునికత నుంచి సంప్రదాయికం వరకు వారి కలెక్షన్లు మరియు స్టైళ్లు శ్రేణిలో సంయోజన పండుగ సీజన్‌కు భారతదేశంలో విస్తృత అభిరుచికి అనుగుణంగా ఉంది. ఈ వాణిజ్య ప్రచార చిత్రం పరికల్పన ఎంత ఆకట్టుకుంటుంది అంటే అది బహుశా మనల్ని ముందుగానే పండుగ ఉత్సాహానికి తోడ్కొని వెళుతుందని చెప్పవచ్చు మరియు మేము ఇప్పుడు మహోన్నత కుటుంబ సమయాన్ని ఆస్వాదించేందుకు వేచి చూస్తున్నామని’’ తెలిపారు.