శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (16:46 IST)

దిగివచ్చిన అరుణ్ జైట్లీ.. 177 వస్తువులపై పన్ను భారం తగ్గింపు

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దిగివచ్చారు. దేశంలో 'ఒకే దేశం - ఒకే పన్ను' విధానంలోభాగంగా జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న జీఎస్టీ విధానంతో నిత్యావసరవస్తు ధరలు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రంపై తీవ

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దిగివచ్చారు. దేశంలో 'ఒకే దేశం - ఒకే పన్ను' విధానంలోభాగంగా జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న జీఎస్టీ విధానంతో నిత్యావసరవస్తు ధరలు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రంపై తీవ్రమైన విమర్శలు చెలరేగాయి.
 
ఈ నేపథ్యంలో విత్తమంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 28 శాతం పన్ను స్లాబ్‌లో 227 వస్తువులు ఉన్నాయి. వీటిలో 177 నిత్యావసర వస్తువులను 18 శాతం స్లాబ్‌లోకి తీసుకొచ్చింది. అంటే ఆయా వస్తువులపై పన్నుభారం 10 శాతం తగ్గింది. అలాగే, 28 శాతం స్లాబ్‌లో కేవలం 50 వస్తువులు మాత్రమే ఉండనున్నాయి. 
 
10 శాతం పన్ను భారం తగ్గిన వస్తు జాబితాలో చాక్లెట్లు, చూయింగ్ గమ్స్, టూత్ పేస్ట్‌లు, షాంపులు, సెంట్ బాటిల్స్, షేవింగ్ క్రీములు, షేవింగ్ లోషన్స్, వాషింగ్ పౌడర్స్, బట్టల సబ్బులు, మేకప్ ఐటమ్స్, గ్రానైట్ ఇలా 177 నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అలాగే, 28 శాతం పన్ను స్లాబ్‌లో ఉన్న నిత్యావసరాలకు సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు.