గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (19:45 IST)

పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడగింపు

దేశంలోని ఆదాయపన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పింది. తాజాగా ఐటీ రిటర్న్స్‌ దాఖలు తేదీని మరోమారు పొడగించింది. గతంలో డిసెంబరు 31వ తేదీ వరకు ఉన్న గడువును మార్చి నెల 15వ తేదీ వరకు పొడగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం, 2022 మార్చి 15వ తేదీ వరకు 2021-22 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయొచ్చు. నిజానికి ఈ గడువు గత యేడాది డిసెంబరు 31వ తేదీతో ముగిసింది. కానీ, ఇపుడు దేశంలో నెలకొన్న కరోనా థర్డ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా ఈ గడువును మరోమారు పొడగించినట్టు పేర్కొంది.