శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:23 IST)

భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌కు కీలక పదవి

భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌కు కీలక పదవి వరించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో రెండో అతిపెద్ద పదవికి ఆమెను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనామిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె టాప్-2 పదవికి ఎంపిక చేశారు. 
 
వచ్చే నెలలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రసుత ఎండీ జాఫ్రీ ఒకమోటో వచ్చే యేడాది జనవరి నెలలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ పదవికి గీతా గోపీనాథ్‌ను ఎంపిక చేశారు. నిజానికి ఆమె వచ్చే యేడాది హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అకడమిక్ పొజిషన్‌కు వెళ్లాల్సివుంది. కానీ, ఆమెను ఐఎంఎఫ్‌లోని టాప్-2 పోస్టుకు ఎంపిక చేశారు.