మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (11:06 IST)

భారత్‌లో హోళి సంబరాలు : చైనా వస్తువుల దహనం..

జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కి, అందులోనూ ప్రత్యేకించి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయకుండా మోకాలడ్డుతున్న చైనా వైఖరిపై భారత ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని వర్తకుల సమాఖ్య ఆధ్వర్యంలో చైనా వస్తువులను దహనం చేసి నిరసన తెలిపారు. 
 
పుల్వామా ఉగ్ర దాడికి కారణమైన మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినప్పటికీ, చైనా పాక్‌కు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు పాక్‌కు మద్దతు ఇస్తూనే చైనా తమ వస్తువులను మన దేశంలో విక్రయించుకోవడాన్ని... నిరసిస్తూ వర్తకులు చైనా వస్తువులను దహనం చేసి నిరసన తెలిపారు.