శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (14:41 IST)

ఇండిగో బంపర్ ఆఫర్.. రూ.915 ధరతో ప్రారంభం.. హెచ్ఎస్బీసీ కార్డుతో?

కరోనా కారణంగా బస్సులు, రైళ్లలో ప్రయాణం కాకుండా.. విమానంలో జర్నీ చేయాలనుకునే వారికి ఓ గుడ్ న్యూస్. తాజాగా ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.

15వ వార్షికోత్సవం పురస్కరించుకుని తక్కువ ధరలకే విమానం టిక్కెట్లను విక్రయించనుంది. ఆగష్టు 4 నుంచి ఆగష్టు 6వరకూ అందుబాటులో సమయంలో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. 
 
ఆ టిక్కెట్లతో 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26 మధ్యలో ప్రయాణించాల్సి ఉంటుంది. రూ.915 మొదలవుతున్న విమాన ప్రయాణ కనీస ధర అంతకుముందు ధరకంటే తక్కువగానే ఉంది.
 
15వ వార్షికోత్సవ ఆఫర్ తో పాటుగా హెచ్ఎస్బీసీ కార్డుతో టిక్కెట్లు కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. కొవిడ్ మహమ్మారితో బ్రేకులు పడ్డ విమాన సర్వీసులు పునరుద్ధరించగా ఆఫర్లతో ఊరిస్తున్నాయి. పైగా కనీసం వ్యాక్సినేషన్ సింగిల్ డోస్ వేసుకున్న వారికి అదనంగా రాయితీ ఇస్తుండటం విశేషం.