ఐటీ రిటర్ను దాఖలు గడువును పెంచిన ఐటీ శాఖ

income tax
సెల్వి| Last Updated: శనివారం, 4 జులై 2020 (17:49 IST)
ఆదాయ పన్ను దాఖలు చేసే వారికి మరో వెసులుబాటు కల్పించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖల చేసేందుకు గడువును మరింతగా పొడగించింది. ఈ తాజా పొడగింపు మేరకు ఐటీ రిటర్నును వచ్చే నవంబరు 30వ తేదీ వరకు దాఖలు చేయవచ్చని పేర్కొంది.

కరోనా సంక్షోభ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. మరోవైపు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రివైజ్డ్ ఐటీ రిటర్నులను ఫైల్ చేసే సమయాన్ని ఈ నెల 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసే గడువును కూడా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించిన విషయం తెల్సిందే. వాస్తానికి ఇది గత నెలాఖరుతో ముగిసింది. కానీ, కరోనా వైరస్ కారణంగా దీన్ని పొడగించింది.

అలాగే, పన్ను ఆడిట్ రిపోర్ట్ నివేదిక గడువును అక్టోబరు 31వ తేదీ వరకు పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను టీడీఎస్/టీసీఎస్ సర్టిఫికెట్ల జారీని ఆగస్టు 15 వరకు పొడిగించినట్టు ఐటీ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.దీనిపై మరింత చదవండి :