శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 మే 2017 (18:08 IST)

చెన్నై టు పారిస్, బెంగుళూరు టు ఆమ్‌స్టర్‌డామ్ నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీస్ : జెట్ ఎయిర్‌వేస్

ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన జెట్ ఎయిర్‌వేస్ త్వరలో మరో రెండు ప్రాంతాలకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్‌లను ప్రారంభించనుంది. ఈ తరహా సర్వీసులను ప్రారంభిస్తున్న ప్రైవేట్ విమాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ కావడం

ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన జెట్ ఎయిర్‌వేస్ త్వరలో మరో రెండు ప్రాంతాలకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్‌లను ప్రారంభించనుంది. ఈ తరహా సర్వీసులను ప్రారంభిస్తున్న ప్రైవేట్ విమాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ కావడం గమనార్హం. ఈ సర్వీల్లో భాగంగా చెన్నై నుంచి పారిస్, బెంగుళూరు నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు విమానాలను నడుపనుంది.
 
భారత్‌కు చెందిన ఓ విమానయాన సంస్థ దక్షిణ భారత్ నుంచి యూరోప్, నార్త్ అమెరికా దేశాలకు ఈ తరహా సర్వీసులను నడపటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సర్వీసుల ప్రారంభోత్సవం సందర్భంగా ఎకానమీ విమాన టిక్కెట్ ధర రూ.33,999గానూ, ప్రీమియర్ విమాన టిక్కెట్ ధర రూ.1,12,999గా నిర్ణయించారు. ఈ కొత్త విమాన సర్వీసులు అక్టోబర్ 29వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. 
 
దక్షిణ భారత్‌లో రెండు ప్రధాన నగరాలుగా ఉన్న చెన్నై, బెంగుళూరుల నుంచి పారిస్, ఆమస్టర్‌డామ్‌లకు విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించడం ఓ మైలురాయి వంటిది. త్వరలో సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకోనున్న నేపథ్యంలో దక్షిణ భారత్‌లోని మరిన్ని ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కొత్త సర్వీసులను వివిధ ప్రాంతాలకు నడపాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ 16 దేశాల్లో 20 డెస్టినేషన్స్ నుంచి ప్రతి రోజూ 150 డైలీ ఫ్లైట్ సర్వీసులను నడుపుతోంది. వీటితో పాటు ఈ సంస్థ కోపార్టనర్ విమాన సంస్థలు కూడా వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడుపుతోంది. 
 
ఈ కొత్త విమాన సర్వీసు అక్టోబర్ 29వ తేదీ నుంచి 9డబ్ల్యూ 128 రకం విమానం చెన్నై నుంచి స్థానిక కాలమానం ప్రకారం అర్థరాత్రి 01.45 గంటలకు బయలుదేరి పారిస్‌కు అక్కడి స్థానిక కాలమానం ప్రకారం 08.10 గంటలకు చేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 9డబ్ల్యూ 127 విమానం పారిస్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం 10.10 గంటలకు బయలుదేరి భారత్ కాలమానం ప్రకారం చెన్నైకు 00.15 గంటలకు చేరుకుంటుంది.
 
అలాగే, బెంగుళూరు నుంచి ఆమస్టర్‌డామ్‌కు బయలుదేరే విమానం 9డబ్ల్యూ 236 రకం ఫ్లైట్ అక్టోబర్ 29వ తేదీ రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 02.25 గంటలకు బయలుదేరి ఆమస్టర్‌డామ్‌కు స్థానిక కాలమానం ప్రకారం 08.35 గంటలకు చేరుతుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 9డబ్ల్యూ 235 రకం విమానం ఆమస్టర్‌డామ్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం 10.50 గంటలకు బయలుదేరి బెంగుళూరుకు స్థానిక కాలమానం ప్రకారం 00.40 గంటలకు చేరుకుంటుంది.
 
ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్ యూరోప్‌లోని ప్రధాని డెస్టినేషన్ ప్రాంతాలైన పారిస్, ఆమస్టర్‌డామ్, బెర్లిన్, బ్రస్సెల్, కోపెన్‌హాగ్, ఎడిన్‌బర్గ్, జెనీవా, హామ్‌బర్గ్, మ్యాడ్రిడ్, మాంచెష్టర్, ఓస్లో, ప్రాగ్యూ, స్టాక్‌హామ్, మునిచ్. లండన్, డుబ్లిన్, జురిచ్, పారిస్, అంట్లాంటా, బోస్టన్, చికాగో, డెట్రాయిట్, హ్యూస్టన్, లాస్ఏంజెల్స్, మియామి, న్యూయార్క్, పోర్ట్‌ల్యాండ్, సాల్ట్ లేక్ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ తదిత ప్రాంతాలకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను జెట్ ఎయిర్‌వేస్‌తో దాని అనుబంధం విమాన సంస్థలు నడుపుతున్నాయి. 
 
ఈ కార్యక్రమంలో ఆ సంస్థ జనరల్ మేనేజర్ (సౌత్) హరీష్ షెనాయ్, డొమెస్టిక్ సేల్స్ (ఇండియా) హెడ్ వి.రాజా, కమర్షియల్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ అయ్యర్, ఇంటర్నేషనల్ సేల్స్ (ఇండియా) హెడ్ అలోక్ సాహ్‌నయ్ తదితరులు పాల్గొన్నారు.