శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: సోమవారం, 28 జనవరి 2019 (11:08 IST)

జియో ఫోన్ యూజర్లకు మరో గిఫ్ట్... జియో రైల్ యాప్‌తో టిక్కెట్స్ బుక్...

జియో ఫోన్ యూజర్లకు జియో మరో బహుమతి ఇచ్చింది. జియో ఫోన్ మరియు జియో ఫోన్ 2 యూజర్లకు జియో రైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా జియో యూజర్లు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా పి.ఎన్.ఆర్ స్టాటస్ చెక్ చేసుకోవచ్చు.
 
డెబిట్, క్రెడిట్ మరియు ఇ-వాల్లెట్ల ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే రైళ్ల రాకపోకల వివరాలు, రిజర్వేషన్ స్టాటస్ వగైరా వివరాలన్నీ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. జియో రైల్ యాప్ ద్వారా తాత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్లకు ఐఆర్‌సిటిసి ఖాతా లేనట్లయితే కొత్తగా ఖాతాను ప్రారంభించేందుకు ఈ యాప్ అనుమతిస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకుని రైల్ టిక్కెట్ బుక్ చేసుకోండి.