శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 28 సెప్టెంబరు 2020 (19:14 IST)

ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్‌ ఆటో లాంఛ్

యుఎస్‌డీ 19.4 బిలియన్‌ డాలర్ల మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌ నేడు తమ నూతన ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ మహీంద్రా ట్రియోను ఫేమ్‌ రాయితీల అనంతరం ఆంధ్రప్రదేశ్‌‌లో 2.7 లక్షల రూపాయల ధరతో (ఎక్స్‌షోరూమ్‌, ఆంధ్రప్రదేశ్‌) ఆవిష్కరించింది.
 
నూతన మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్‌ ఆటోను పూర్తిగా భారతదేశంలో రూపొందించి, అభివృద్ధి చేశారు. ఇది అత్యున్నత శ్రేణి పనితీరును గరిష్టంగా 55 కెఎంపీహెచ్‌తో అందిస్తుంది. కేవలం 2.3 సెకన్లలోనే 0-20 కెఎంపీహెచ్‌ వేగం అందుకోవడంతో పాటుగా తమ శ్రేణిలో ఉన్నతమైన గ్రేడబిలిటీ 12.7 డిగ్రీలు ప్రదర్శిస్తుంది. నూతన మహీంద్రా ట్రియోతో సంవత్సరానికి 45 వేల రూపాయల వరకూ వాహన యజమానులు ఆదా చేసుకోవచ్చు. 
 
ట్రియోను కేవలం 50 వేల రూపాయల అతి తక్కువ డౌన్‌‌పేమెంట్‌ చెల్లించి మహీంద్రా ఫైనాన్స్‌, అతి తక్కువ వడ్డీ రేటు పథకమైన 10.8%తో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఋణాలను పొందవచ్చు. మహీంద్రా ట్రియో వాహనాలు ఆకర్షణీయమైన మార్పిడి బోనస్‌ అయినటువంటి 5 వేల రూపాయలతో వస్తున్నాయి.
 
ఈ ఆవిష్కరణ గురించి మహేష్‌ బాబు, ఎమ్.డి అండ్‌ సీఈవో, మహీంద్రా ఎలక్ట్రిక్‌ మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అత్యంత వేగంగా ఈవీలను స్వీకరిస్తుంది. ఈ విభాగంలో ఇప్పటికే మార్కెట్‌ లీడర్‌గా ట్రియో వెలుగొందుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే 100కు పైగా ట్రియోలు రోడ్ల మీద తిరుగుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా 400కు పైగా జిల్లాల్లో 5 వేలకు పైగా ట్రియో సంతోషకరమైన వాహనదారులు తిరుగుతుండటంతో పాటుగా ఇప్పటికే ట్రియో 1.6 కోట్ల కిలోమీటర్లను భారతీయ రోడ్లపై ప్రయాణించారు.
 
నూతన మహీంద్రా ట్రియో మరింతగా మా వినియోగదారులకు ఆదా చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. రాష్ట్రపు తొలి, తుది మైలు మొబిలిటీ అవసరాలను ఇది ఖచ్చితంగా తీర్చగలదు. భారతీయ ఈవీ వృద్ధిపై ఎలక్ట్రిక్‌ 3 వీలర్స్‌ ఆధిపత్యం వహిస్తాయని మేము పూర్తిగా నమ్ముతున్నాము. ఇది ఆర్ధికంగా, పర్యావరణపరంగా, సామాజికంగా అనుకూలంగా ఉంటుంది’’ అని అన్నారు.
 
అత్యధికంగా 45వేల రూపాయల వరకూ ఆదా:
మహీంద్రా ట్రియో యొక్క రన్నింగ్‌ ఖర్చు కిలోమీటరుకు కేవలం 50 పైసలు మాత్రమే, తద్వారా ఇంధన ఖర్చులపై 45 వేల రూపాయల వరకూ సంవత్సరానికి ఆదా చేయగలరు. లిథియం-అయాన్‌ బ్యాటరీకి జీరో మెయిన్‌టెనెన్స్‌అవసరం పడుతుంది. ఇది 1.5 లక్షల కిలోమీటర్లకు పైగా క్లిష్టత లేని ప్రయాణం అందిస్తుంది.
 
విభాగంలో అత్యున్నత పనితీరు:
నూతనంగా మెరుగుపరిచిన ఏసీ ఇండక్షన్‌ మోటార్‌ ఇప్పుడు అత్యధిక శక్తి 8కిలోవాట్లను మరియు అత్యధిక/అద్భుతమైన టార్క్‌ 42 ఎన్‌ఎం అందిస్తుంది. మహీంద్రా ట్రియో యొక్క టాప్‌ స్పీడ్‌ను గరిష్టంగా 55కెఎంపీహెచ్‌ వృద్ధి చేశారు. మెరుగైన గ్రేడియబిలిటీ 12.7 డిగ్రీలు.
 
అత్యాధునిక సాంకేతికత:
లిథియం- అయాన్‌ టెక్నాలజీ:  నూతన మహీంద్రా ట్రియోలో అత్యాధునిక లిథియం అయాన్‌ టెక్నాలజీ ఉంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 130 కిలోమీటర్ల వరకూ (ప్రకటించిన డ్రైవింగ్‌ శ్రేణి) ప్రయాణిస్తుంది.
 
ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌: ఇది ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది మరియు గేర్‌లెస్‌, క్లచ్‌లెస్‌ మరియు వైబ్రేషన్‌ రహితంగా ఉంటుంది. డ్రైవింగ్‌ను అలసట రహితంగా, సౌకర్యవంతంగా మారుస్తుంది.
 
చార్జింగ్‌ చేసుకోవడం సులభం: మహీంద్రా ట్రియోను ఎక్కడైనా సరే చార్జింగ్‌చేసుకోవచ్చు మరియు ఇది పోర్టబుల్‌ చార్జర్‌తో వస్తుంది. దీనిని 15యాంప్స్‌ సాకెట్‌ ఉపయోగించి ఎక్కడైనా చార్జ్‌ చేసుకోవచ్చు. ఆధారపడతగ్గ ఐపీ67 రేటెడ్‌ మోటార్‌ మెరుగైన భద్రతను డస్ట్‌ మరియు నీరు ప్రవేశం నుంచి అందిస్తుంది.
 
తుప్పుపట్టని బాడీ ప్యానెల్స్‌: సులభంగా శుభ్రపరుచుకునేందుకు మాడ్యులర్‌ రస్ట్‌ ఫ్రీ షీట్‌ మౌల్డింగ్‌ కాంపౌండ్‌ (ఎస్‌ఎంసీ) ప్యానెల్స్‌.
 
అత్యున్నత ప్రదేశం మరియు సౌకర్యం:
అత్యున్నత శ్రేణి వీల్‌ బేస్‌: అతి పొడవైన 2073 మిల్లీమీటర్‌ వీల్‌బేస్‌తో మహీంద్రా ట్రియో, తమ విభాగంలో అత్యుత్తమ సౌకర్యంను మరింత లెగ్‌ రూమ్‌ మరియు అన్ని వయసుల వారూ సులభంగా లోపలకు మరియు బయటకు వచ్చేందుకు అనుమతిస్తుంది.
 
మెరుగైన భద్రత: మహీంద్రా ట్రియో సైడ్‌ డోర్స్‌ను అందిస్తుంది. ఇది సవారీని మరింత సురక్షితంగా మారుస్తుంది.