Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆలస్యంగా రావడంలో ఆ రైలు ఫస్ట్...

సోమవారం, 10 జులై 2017 (15:23 IST)

Widgets Magazine

దేశంలో నడిచే రైళ్లు సమయానికి రావు అనే అపవాదు ఉంది. దీన్ని మరింతగా రుజువు చేసేలా ఓ ట్రైన్ ఏకంగా సగటున 11 గంటల పాటు ఆలస్యంగా నడుస్తుంది. వారంలో ఒక్కరోజు నడిచే ఈ రైలు ప్రతి వారంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇంతకీ ఆ రైలు పేరు తెలుసుకోవాలని ఉంది కదా. అది మండ్వాడీ-రామేశ్వ‌రం వీక్లీ ఎక్స్‌ప్రెస్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మండ్వాడీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంకు వారంలో ఒక్కసారి నడుస్తుంది. ఆ ఒక్కసారి కూడా సగటున 11 గంటల 5 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తుంది.
rameswaram exp
 
ఈ రైలు 2790 కిలోమీటర్లు పట్టాలపై పరుగెత్తాల్సి ఉంది. 35 స్టేషన్లలో ఆగి వెళ్తుంది. దీంతో గమ్య స్థానానికి చేరుకునేందుకు నాలుగు రోజుల సమయం పడుతుంది. ప్రతి ఆదివారం రాత్రి 21.00 గంటలకు మండ్వాడీలో బయలుదేరే ఈ రైలు రామేశ్వరానికి గురువారం అర్థరాత్రి 00.40 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు సగటు వేగం 54 కిలోమీటర్లు కాగా గరిష్ట వేగం 110 కిలోమీటర్లు. మొత్తం ట్రావెల్ సమయం 51 గంటల 40 నిమిషాలు. 
 
అందుకే దేశంలో ఆలస్యంగా నడిచే రైళ్ళలో ఈ రైలు మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. ఆ తర్వాత స్థానంలో ప‌శ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి జ‌మ్ముతావి వ‌ర‌కు వెళ్లే హిమ‌గిరి సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రెండో స్థానంలో ఉంది. దీని స‌రాసరి లేటు 9.3 గంట‌లు. అలాగే అమృత్‌స‌ర్ నుంచి బీహార్‌లోని ద‌ర్భంగా వెళ్లే జ‌న నాయ‌క్ ఎక్స్‌ప్రెస్ 8.9 గంట‌ల స‌రాస‌రి లేటుతో మూడో స్థానంలో నిలిచింది. 
 
దేశ వ్యాప్తంగా ఆలస్యంగా నడిచై రైళ్ళపై ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో దాదాపు 2 కోట్ల మంది వరకు పాల్గొన్నారు. ఇకపోతే.. ప్ర‌యాణికుల‌కు బాగా ఇష్ట‌మైన రైల్వే స్టేష‌న్లుగా వ‌డోద‌ర‌, హౌరా, నాగ్‌పూర్ స్టేష‌న్లు నిలిచాయి. ఆహారం విష‌యంలో క‌ర్ణాట‌క‌లోని దేవ‌న‌గ‌ర జంక్ష‌న్‌కి, అహ్మ‌దాబాద్‌-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్‌కి ప్ర‌యాణికులు మొద‌టి ర్యాంకు ఇచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

పెట్రోలు, డీజిల్ కార్లు కొనకండి స్వాములూ.. 750 కిలోమీటర్లు నడిచే సోలార్ కార్లొస్తున్నాయ్

జీఎస్టీ పుణ్యమా అని కార్లధరలు విపరీతంగా తగ్గుతున్నాయని పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు ...

news

జీఎస్టీ ఎఫెక్ట్... సెంచరీ కొట్టిన టొమాట ధర

దేశవ్యాప్తంగా టొమాట ధరలు ఆకాశానికి తాకాయి. ప్రధాన మెట్రో నగరాల్లోనే కాకుండా దేశ ...

news

షాపింగ్ మాల్స్, ఐమ్యాక్స్‌ల్లో నిలువుదోపిడీ ఇకనైనా ఆగేనా.. కేంద్రం కొరడా నిజంగానే తగిలేనా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దాని పూర్తి అర్థంలో నిజంగా ...

news

ఆన్‌లైన్ మోసాలపై ఖాతాదారులకు పూర్తి రక్షణ.. పది రోజుల్లో ఖాతాలో జమ

ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్‌ ...

Widgets Magazine