గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (13:08 IST)

రూ.100 నుంచి రూ.150 పలుకుతున్న మామిడి పండ్లు

Mango
పండ్లలో రారాజు అయిన మామిడి పండ్లు చౌకగా లభ్యమవుతున్నాయి. మామిడి ఉత్పత్తి ఈ ఏడాది తగ్గడంతో గత ఏడాది పోల్చితే డిమాండ్ పెరగలేదు. ఫలితంగా నాణ్యమైన మామిడి కిలో రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది.
 
"సాధారణంగా 650 నుండి 700 ట్రక్కుల మామిడి పండ్లు మార్కెట్‌కు వస్తాయి. అయితే ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి సగటున 400 ట్రక్కులు మార్కెట్‌కు వస్తున్నాయి. పంట ఆలస్యమవడం, ఇతర కారణాల వల్ల జూన్ నెల వరకు ఈ పండు అందుబాటులో ఉంటుందని మాకు చెప్పారు" అని బాటసింగారం పండ్ల మార్కెట్ కమిటీ కార్యదర్శి సీహెచ్ నర్సింహారెడ్డి తెలిపారు.
 
బంగనపల్లి, దశెహరి, కేసర్, హిమాయత్, తోటపురి మరికొన్ని రకాల మామిడి పండ్లు రాష్ట్రంలో విరివిగా కనిపిస్తాయి. ఇది కాకుండా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ నుండి కూడా సరఫరా అవుతాయి. 
 
'గత రెండేళ్లలో, కోవిడ్ లాక్‌డౌన్ సంబంధిత నిబంధనల కారణంగా సరఫరా దెబ్బతింది. ఈ సంవత్సరం, దిగుబడి తక్కువగా ఉంది. కాబట్టి సరఫరా కూడా 60 నుండి 70 శాతం తక్కువగా ఉంది" అని కిషన్ రెడ్డి చెప్పారు.
 
తక్కువ దిగుబడులు రావడానికి గల కారణాలను వివరిస్తూ, పూత దశలో ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారలేదని, ఫలితంగా నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ అధికారి ఒకరు తెలిపారు. "నవంబర్ నుండి జనవరి వరకు పూతలు వస్తాయి. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు అనుకూలంగా లేవు, ఫలితంగా పువ్వులు దెబ్బతిన్నాయి." అని ఆమె చెప్పారు.