మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 27 ఆగస్టు 2024 (21:50 IST)

కిచ్చా సుదీప్‌తో కలిసి క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఆవిష్కరించిన మెక్‌డొనాల్డ్స్ ఇండియా

Kiccha Sudeep
దక్షిణ భారత మార్కెట్ కోసం ఫ్రైడ్ చికెన్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యగా, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ యాజమాన్యంలోని, నిర్వహించబడుతున్న మెక్‌డొనాల్డ్స్ ఇండియా, క్రిస్పీ ఫ్రైడ్ చికెన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో కంటే మరింత రుచిగా కరకరలాడే ఈ  ఫ్రైడ్ చికెన్ ఈ ప్రాంతంలో బ్రాండ్ యొక్క చికెన్ పోర్ట్‌ఫోలియోను మరింత సమున్నతం చేయనుంది. ఈ ప్రయత్నానికి ఉత్సాహాన్ని జోడిస్తూ, మెక్‌డొనాల్డ్స్ ఇండియా ఇప్పుడు ప్రఖ్యాత కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్‌ను తమ కొత్త ప్రచార చిత్రం- ‘లెట్ ది క్రంచ్ టేకోవర్’కు ముఖచిత్రంగా చేర్చుకుంది.
 
ఈ ప్రచారంలో భాగంగా కిచ్చా సుదీప్ నటించగా డిడిబి ముద్రా గ్రూప్ రూపొందించిన టివిసి ప్రసారం చేయనున్నారు. ఈ టివిసిలు కన్నడ స్టార్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్‌ని ఆస్వాదించడాన్ని, ఉత్పత్తి యొక్క క్రిస్పీ ఆకృతిని హైలైట్ చేస్తాయి. మెక్‌డొనాల్డ్స్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అరవింద్ ఆర్.పి.  మాట్లాడుతూ, “మెక్‌డొనాల్డ్స్‌ వద్ద మేము, దక్షిణాది మార్కెట్‌లలో మా కస్టమర్‌లకు వివిధ రకాల చికెన్ ఉత్పత్తులను అందించడానికి మేము మా మెనూ పోర్ట్‌ఫోలియోను నిరంతరం బలోపేతం చేస్తున్నాము. మా కొత్త క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ క్యాంపెయిన్‌లో కిచ్చా సుదీప్ కనిపించటం ఈ వ్యూహానికి నిదర్శనం. అతనితో మా భాగస్వామ్యం మరింతగా అభిమానులకు చేరువ కావటం సాధ్యమవుతుంది" అని అన్నారు. 
 
కిచ్చా సుదీప్ మాట్లాడుతూ, “మెక్‌డొనాల్డ్స్ ఇండియా (డబ్ల్యు &ఎస్) కొత్త క్రిస్పీ ఫ్రైడ్ చికెన్‌ని ఆవిష్కరించటం కోసం వారితో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల  సంతోషంగా వున్నాను. ఈ కొత్త ఆఫర్‌లో క్రంచ్ మరియు ఫ్లేవర్ యొక్క సారాన్ని బ్రాండ్ నిజంగా సంగ్రహించడం చూసి సంతోషిస్తున్నాను.  క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఖచ్చితంగా నేను ఇష్టపడే సంతృప్తికరమైన క్రంచ్‌తో అందరినీ కట్టిపడేస్తుంది.." అని అన్నారు.