Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జూలై-సెప్టెంబరులో బెంజ్ కార్ల అమ్మకాలు 41 శాతం పెరుగుదల

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (20:25 IST)

Widgets Magazine
Mercedes-Benz Car

మెర్సిడెజ్ బెంజి కార్లు రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకువెళ్తున్నాయి. జనవరి నుంచి సెప్టెంబరు 2017 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 11869 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ తెలియజేసింది. గత ఏడాదితో పోల్చితే ఈ వృద్ధి రేటు 19.6 శాతంగా వున్నట్లు వెల్లడించింది. 
 
కార్ల అమ్మకాల వివరాలను చూస్తే... 
జూలై-సెప్టెంబరు 2017 మధ్య కాలంలో బెంజ్ కార్ల అమ్మకాలు 4698 యూనిట్లు కాగా గత ఏడాదిలో 3327 యూనిట్లు అమ్ముడయ్యాయి. 41 శాతం అమ్మకాలు పెరిగాయి. 
 
2014 ఏడాది మొత్తం 10,201 కార్లను అమ్మగా 2017లో మూడు త్రైమాసికల్లోనే ఈ నెంబరును దాటేసింది మెర్సిడెజ్ బెంజ్. అమ్మకాల్లో ఇ క్లాస్ సెడాన్ ప్రథమ స్థానంలో వుండగా ఆ తర్వాత స్థానంలో సి క్లాస్ సెడాన్ వుంది. మెర్సిడెజ్ బెంజ్ కార్ల అమ్మకాలు ఇదే ఊపును కొనసాగిస్తాయని కంపెనీ భావిస్తోంది. 
 
ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రోలాండ్ ఫోల్జర్ మాట్లాడుతూ... ఇండియన్ లగ్జరీ కార్ల మార్కెట్లో మెర్సిడెజ్ బెంజ్ కార్లు తమ అగ్రస్థాయిని కొనసాగిస్తాయన్నారు. మొదటి మూడు త్రైమాసికాల్లో రికార్డు స్థాయిలో 41 శాతం పెరుగుదలతో మాపై మరింత బాధ్యత పెరిగిందనీ, వినియోగదారులు ఏమేమి ఫీచర్లు కోరుకుంటున్నారన్న దానిపై దృష్టి సారించినట్లు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఒక్క కలం పోటుతో లక్షల కంపెనీలు రద్దు : ప్రధాని మోడీ

నల్లధనాన్ని అరికట్టేందుకు 2.1 లక్షల నకిలీ కంపెనీలను ఒక్కకలం పోటుతో రద్దు చేశామని ...

news

రైలు టిక్కెట్ల బుకింగ్స్‌పై సేవా రుసుం మినహాయింపు పొడిగింపు

గత యేడాది దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్‌లో ఆన్‌లైన్‌ రైల్వే టికెట్లపై సేవా ...

news

మనీలాండరింగ్ కేసులో విజయ్ మాల్యా అరెస్టు

మనీ లాండరింగ్ కేసులో లిక్కర్ డాన్ విజయ్ మాల్యాను లండన్‌లో అరెస్టు చేశారు. భారత్‌లోని పలు ...

news

పాత రూ.100 నోటు చెల్లదట... ఏప్రిల్ నుంచి కొత్త నోటు...

దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత యేడాది ప్రధానమంత్రి నరేంద్ర ...

Widgets Magazine