1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 12 జులై 2025 (18:32 IST)

ఇన్‌స్టామార్ట్ 10 నిమిషాల డెలివరీని సాదరంగా ఆహ్వానించిన హైదరాబాద్

Instamart
2021లో హైదరాబాద్ వ్యాప్తంగా కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుండి, భారతదేశపు మార్గదర్శక త్వరిత వాణిజ్య (క్విక్ కామర్స్) వేదిక, ఇన్‌స్టామార్ట్, రోజువారీ నిత్యావసర వస్తువుల నుండి ప్రీమియం కొనుగోళ్ల వరకు ప్రతిదీ డెలివరీ చేయడానికి నగర వాసులు ఇష్టపడే గమ్యస్థానంగా మారింది. రోజువారీ డిమాండ్‌ను కిరాణా సామాగ్రి కొనసాగిస్తుండగా, నిత్యావసరాలకు మించి వివిధ విభాగాలు గణనీయమైన రీతిలో ఆదరణను పొందుతున్నాయి, ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, వ్యక్తిగత సంరక్షణ విభాగాలు అద్భుతమైన వృద్ధిని చూస్తున్నాయి. ప్రేరణ మాత్రమే కాకుండా ప్రణాళికాబద్ధమైన కొనుగోళ్లను కూడా వేగవంతంగా డెలివరీ చేయడానికి త్వరిత వాణిజ్య వేదికలపై పెరుగుతున్న వినియోగదారుల నమ్మకాన్ని ఈ  పెరుగుదల చూపుతుంది.
 
హైదరాబాద్‌లో త్వరిత వాణిజ్య స్వీకరణకు ప్రధాన కారణం దాని ప్రత్యేకమైన సాంస్కృతిక వైవిధ్యత. సంప్రదాయం, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఆనందం యొక్క శక్తివంతమైన మిశ్రమమీ నగరం. గత ఆరు నెలలుగా, నగరంలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వస్తువులలో ఇడ్లీ, దోస పిండి, పాలు, పెరుగు, శీతల పానీయాలు, గుడ్లు, పచ్చి మామిడి, వేరుశనగలు ఉన్నాయి. రోజువారీ నిత్యావసరాలకు మించి, హైదరాబాదీలు ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, సౌందర్య సాధనాల వంటి కిరాణాయేతర విభాగాల కోసం ఇన్‌స్టామార్ట్ వైపు మొగ్గు చూపుతున్నారు, ఇవి ఇక్కడ  వేగంగా వృద్ధి చెందుతున్నాయి. 
 
బ్యాటరీలు, సాకెట్ సర్జ్ గార్డ్‌లు, ఫాస్ట్-ఛార్జింగ్ కేబుల్స్, ప్లేయింగ్ కార్డ్‌లు, విద్యా ఎల్ సిడి రైటింగ్ ప్యాడ్‌ల వంటి ఉత్పత్తులకు అధిక డిమాండ్‌తో ఎలక్ట్రానిక్స్, బొమ్మలకు డిమాండ్ 117% పెరిగింది. బ్యూటీ విభాగంలో, వినియోగదారులు లిప్ లైనర్లు, మినీ లిప్‌స్టిక్‌లు, లిప్ గ్లాస్ మరియు లిప్ బామ్‌లు వంటి సరసమైన,అధునాతన ఎంపికల కోసం ఇక్కడకు చేరుకుంటున్నారు. వివాహ సీజన్‌లో, ఇన్‌స్టామార్ట్ బ్యూటీ & పర్సనల్ కేర్ విభాగంలో చివరి నిమిషంలో ఆర్డర్‌ల పరంగా పెరుగుదలను చూసింది, లిప్ బామ్‌లు, లిప్ లైనర్లు, మేకప్ బ్రష్‌లు వంటి బ్యూటీ ఉత్పత్తుల నుండి ఆభరణాలు (చెవిపోగులు) వాటర్ క్యాన్‌ల వరకు, వివాహ అత్యవసర పరిస్థితులు, పండుగ రద్దీని తీర్చటంలో దాని కీలక పాత్రను ప్రదర్శిస్తుంది. వర్షాకాలపు విషయానికొస్తే, వంట నూనె, ఉల్లిపాయలు వంటి నిత్యావసర వస్తువులకు, అలాగే స్నాక్స్, పానీయాల విభాగంలో ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటి వాటికి ఆర్డర్‌లు పెరిగాయి.
 
ఆసక్తికరంగా, గత సంవత్సరంలో, హైదరాబాద్ అర్ధరాత్రి తర్వాత అత్యధిక ఆర్డర్‌లను చూసింది, దీనికి నగరంలోని శక్తివంతమైన ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల సంఖ్య కారణం కాగా అర్థరాత్రి కూడా పెరుగుతున్న సౌకర్యాల సంస్కృతి, విస్తృత శ్రేణి ఉత్పత్తులలో చివరి నిమిషపు కోరికలు, అత్యవసర అవసరాలను తీర్చటం మరో కారణం. ఒక నమ్మకమైన వినియోగదారుడు ఒక సంవత్సరం లోపల 617 ఆర్డర్‌లను చేశాడు, వినియోగదారుల ప్రణాళికాబద్ధమైన రోజువారీ దినచర్యలలో అంతర్భాగంగా ఇన్‌స్టామార్ట్ మారిందని ఇది చూపిస్తుంది. సగటు డెలివరీ సమయం ఇక్కడ 11 నిమిషాలు, వ్యూహాత్మకంగా ఉన్న డార్క్ స్టోర్‌ల బలమైన నెట్‌వర్క్ ద్వారా ఇది సాధ్యమైనది.
 
హైదరాబాద్ యొక్క త్వరిత వాణిజ్య వృద్ధిపై ఇన్‌స్టామార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హరి కుమార్ జి, మాట్లాడుతూ, “స్థానిక సంప్రదాయాలను ఆధునిక ప్రాధాన్యతలతో అందంగా మిళితం చేసే నగరంలోకి త్వరిత వాణిజ్యం సహజంగా ఎలా మిళితమవుతుందో తెలిపేందుకు హైదరాబాద్ ఒక ప్రధాన ఉదాహరణ. ఇడ్లీ, దోసె పిండి వంటి ముఖ్యమైన వస్తువులను సాంప్రదాయ గృహాలకు అందించడం నుండి, నగరంలోని యువ, శక్తివంతమైన ఉద్యోగుల కోసం ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వరకు, ఇన్‌స్టామార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై పెరుగుతున్న వినియోగదారుల విశ్వాసం, నమ్మకాన్ని మేము చూస్తున్నాము. మా లోకల్ -ఫస్ట్ విధానం వివిధ విభాగాలలో నాణ్యమైన ఉత్పత్తులకు విస్తృత అవకాశాలను నిర్ధారిస్తుంది. హైదరాబాద్ యొక్క అభివృద్ధి చెందుతున్న డిమాండ్‌లను సాటిలేని సౌలభ్యంతో తీర్చడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని అన్నారు.