ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2023 (19:45 IST)

ఫ్యాషన్ ప్రియులందరినీ పిలుస్తోంది: మింత్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ డిజిటల్ ఫ్యాషన్‌ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌

image
ఆన్‌లైన్ ఫ్యాషన్ మార్కెట్ ఈరోజు ఓ విశిష్టతను చూడబోతున్నది. భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్, అందం, జీవనశైలి గమ్యస్థానాలలో ఒకటైన మింత్రా భాగస్వా మ్యంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ఈ తరహాలో తన మొదటి కో-బ్రాండెడ్ డిజిటల్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టబోతున్నది. అనేక ప్రయోజనాలను అందిస్తూ, కో-బ్రాండెడ్ చేయబడిన కోటక్ మింత్రా క్రెడిట్ కార్డ్ అపరిమిత లావాదేవీల ద్వారా తమ పొదుపుపై గొప్ప విలువను అన్‌లాక్ చేయడానికి ఫ్యాషన్ స్పృహతో ఉన్న వినియోగదారులను శక్తివంతం చేస్తుంది. మింత్రా, కోటక్ మొబైల్ యాప్‌లలో నిమిషాల వ్యవధిలో అవాంతరాలు లేని డిజిటల్ ప్రయాణం ద్వారా కార్డుని పొందవచ్చు. ఇప్పటికే ఉన్న మింత్రా  కస్టమర్‌లు మింత్రా యాప్‌లోనే పూర్తిగా డిజిటల్ జర్నీ ద్వారా కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.      
 
కోటక్ మింత్రా క్రెడిట్ కార్డ్ మాస్టర్ కార్డ్, రూపే నెట్‌వర్క్‌‌లలో అందుబాటులో ఉంటుంది.
కోటక్ మింత్రా క్రెడిట్ కార్డ్ విశిష్టతలు
మింత్రాలో అపరిమిత లావాదేవీలపై 7.5% తక్షణ తగ్గింపు, ఒక్కో లావాదేవీకి రూ.750 వరకు
మింత్రా ఇన్‌సైడర్‌కి కాంప్లిమెంటరీ యాక్సెస్
కొన్ని ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లతో ఏదైనా కొనుగోలుపై 5% క్యాష్‌బ్యాక్
స్విగ్గీ, స్విగ్గీ ఇన్ స్టా మార్ట్, పీవీఆర్, క్లియర్ ట్రిప్, అర్బన్ కంపెనీ
ఇతర కార్డ్ ఖర్చులపై అపరిమిత 1.25% క్యాష్‌బ్యాక్
త్రైమాసికంగా 2 PVR మూవీ టిక్కెట్‌లు
కార్డ్ యాక్టివేషన్‌పై రూ. 500 ఇ-వోచర్
 
కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ కార్డ్స్- బిజినెస్ హెడ్ ఫ్రెడరిక్ డిసౌజా మాట్లాడుతూ, ‘‘మింత్రా ఫ్యాషన్, కస్టమర్ అనుభూతిని అందించడంలో అత్యుత్తమమైనదానికి పర్యాయపదంగా ఉంది. వివేకం గల ఫ్యాషన్ ఔత్సాహికుల కోసం ఈ ప్రత్యేకమైన ఉత్పత్తిని అందించడానికి మింత్రాతో భాగస్వామ్యం కావడానికి మేం సంతో షిస్తున్నాం. మా భాగస్వామ్యం అనేది కొనుగోలుదారు ఆనందం, విశ్వాసం కోసం నిలబడే అన్నింటి సంగమం. ఈ క్రెడిట్ కార్డ్ మా లక్షిత కస్టమర్ల జీవనశైలి, ఫ్యాషన్ షాపింగ్ అలవాట్లకు అనుగుణంగా ప్రత్యేక సదుపాయా లు, సాటిలేని ప్రయోజనాలతో రూపొందించబడింది. మేం వారి క్రెడిట్ అవసరాలను తీర్చడానికి, అసమానమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.
 
కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అధునాతన, నూతన తరం వినియోగదారులకు వారి ఫ్యాషన్ అవసరాలకు తగిన ఎంపికను అందించే లక్ష్యంతో రూపొందించబడింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ ఇ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించడం కూడా ఈ కార్డ్ లక్ష్యం. ఇది ఈ కార్డుకు భారీ అవకాశాన్ని అందిస్తుంది. ఫ్యాషన్ ఇ-కామర్స్ వృద్ధికి మిలీనియల్స్, అలాగే జెన్ జెడ్ కస్టమర్ విభాగాలతో కూడిన డిజిటల్ స్థానిక కస్టమర్‌లు సారథ్యం వహిస్తారు.
 
మింత్రా వైస్ ప్రెసిడెంట్ (పార్ట్ నర్ షిప్స్, మానిటైజేషన్) సంతోష్ కెవ్లానీ మాట్లాడుతూ, ‘‘పరిశ్రమలో మొట్టమొదటిసారిగా, మింత్రా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ ని మెట్రోలు, టైర్ 1, టైర్ 2, 3 నగరాలు,  అంతటా ఫ్యాషన్ షాపర్‌లకు అంకితం చేస్తున్నాం. బ్రాండ్ కు కట్టుబడి ఉండడం, అద్భుతమైన బ్రాండ్ రీకాల్‌ని సృష్టించడం దీని లక్ష్యం. ఈ విధంగా కలసి పని చేయడం ద్వారా మా కస్టమర్‌లకు అసమానమైన, రివార్డింగ్ చెల్లింపు ఎంపిక ను అందించడం ద్వారా  మింత్రాలో షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. కో టక్ మహీంద్రా బ్యాంక్   భారతదేశం లోని అతిపెద్ద, అత్యంత విశ్వసనీయ ఆర్థిక సంస్థలలో ఒకటి. ప్రగతిశీలక భాగస్వామి బ్యాంక్‌గా దాని స్థానం ఉన్నతంగా ఉంది, మా లాంటి బ్రాండ్‌తో బాగా ప్రతిధ్వనిస్తుంది. ఈ అను బంధం మా కస్టమర్‌లకు తిరుగులేని, రివార్డింగ్ షాపింగ్ అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుందని, అలాగే వారి కొనుగోళ్లపై మరింత ఆదా చేసుకునేందుకు వీలు కల్పిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
 
మాస్టర్‌కార్డ్ వైస్ ప్రెసిడెంట్ (దక్షిణాసియా డిజిటల్ పార్టనర్‌షిప్స్)ఆదిత్య మూర్తి మాట్లాడుతూ, ‘‘కొటక్ మహీంద్రా బ్యాంక్, మింత్రాతో కలిసి సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌లతో తాజాగా ఉండాలనుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ప్రతిపాదనను తీసుకురావడానికి మాస్టర్‌కార్డ్ సంతోషిస్తున్నది. మింత్రా క్రెడిట్ కార్డ్ అనేది ఫ్యాషన్, లైఫ్ స్టైల్ స్పేస్‌లో గేమ్-ఛేంజర్. ఇది మింత్రా  విస్తృత  కలెక్షన్ లో షాపింగ్ చేయడానికి ఇష్టపడే వినియోగదారులకు అసమానమైన ప్రయోజనాలను అందిస్తుంది’’ అని అన్నారు.
 
NPCIలో కార్పొరేట్, ఫిన్‌టెక్ రిలేషన్‌షిప్స్, కీ ఇనిషియేటివ్స్ చీఫ్  నలిన్ బన్సాల్ మాట్లాడుతూ, ‘‘బలమైన రూపే నెట్‌వర్క్‌ లో మింత్రా కోటక్ కోబ్రాండ్ కార్డ్‌ ను ప్రారంభించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో భాగ స్వామ్యం కావడానికి మేం సంతోషిస్తున్నాం. యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్  తో, మా భాగస్వామ్యం ఈ కార్డ్ వినియోగదారులకు సురక్షితమైన, సంతోషకరమైన రివార్డింగ్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని మేం విశ్వ సిస్తున్నాం’’ అని అన్నారు.