మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 జూన్ 2023 (22:15 IST)

థియేటర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి పీవీఆర్-ఐనాక్స్‌తో నెస్లే ప్రొఫెషనల్ భాగస్వామ్యం

పీవీఆర్-ఐనాక్స్ సినిమా హాళ్లలో చలనచిత్ర అనుభవాలు ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఇష్టపడే కాఫీ బ్రాండ్‌లలో ఒకటైన నెస్కెఫెతో మరింత సమున్నతమవుతాయి. 80 సంవత్సరాలకు పైగా రోస్టింగ్, బ్రూయింగ్ నైపుణ్యంతో రూపొందించబడిన, నెస్లే నుండి వచ్చే నెస్టీ కార్డమామ్ టీ, నెస్ క్విక్ హాట్ కోకోతో సహా అనేక రకాల పానీయాల ఎంపికలతో పాటు నెస్కెఫె అనేది ఇప్పుడు భారతదేశంలోని 29 నగరాల్లోని 200 పీవీఆర్-ఐనాక్స్ థియేటర్‌లలో అందుబాటులో ఉంటుంది.
 
ఈ అనుబంధం గురించి నెస్లే ఇండియా నెస్లే ప్రొఫెషనల్ హెడ్ సౌరభ్ మఖీజా మాట్లాడుతూ, “మా వినియోగదారులు ఇంట్లో, ఇంటి వెలుపల నెస్లే బ్రాండ్‌లను ఆస్వాదించేలా చేయడానికి మేం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాం. ఈ భాగస్వామ్యం మా శ్రేణి పానీయాల కోసం బహుళ సంబంధిత వినియోగ సందర్భాలను నిర్మించచడంలో ఒక ముందడుగు. సినిమా థియేటర్లు సంప్రదాయకంగా ఒక ప్రముఖ వినోద కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ అనుబంధం  ద్వారా మేం కొత్త యుగం సినిమా ప్రేక్షకుల అనుభవాన్ని మెరుగుపరచాలనుకుంటున్నాం. వినియోగదారులు ఇప్పుడు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మా అత్యాధునిక వెండింగ్ మెషీన్‌ల నుండి తాజాగా పంపిణీ చేయబడిన నెస్కెఫె నుండి తాజాగా తయారుచేసిన కాఫీ, నెస్ క్విక్ నుండి వేడి వేడి కోకో లేదా నెస్టీ నుండి ఒక ఉత్తేజకరమైన టీ వంటి వెచ్చని, సౌక్యర్యవంతమైన పానీయాన్ని ఆస్వాదించవచ్చు’’ అని అన్నారు.
 
ఈ అనుబంధం గురించి పీవీఆర్-ఐనాక్స్ లిమిటెడ్ కో- సీఈఓ గౌతమ్ దత్తా మాట్లాడుతూ, “సినిమా మూమెంట్స్ ఒక సినిమా చూడటం నుండి కుటుంబం, స్నేహితులతో ఒక పెద్ద అనుభవం వరకు అభివృద్ధి చెందాయి. మా భాగస్వాముల మాదిరిగానే, సినిమా ద్వారా మా పోషకులు విశ్రాంతి తీసుకోవడానికి, జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడానికి సహాయం చేయడానికి మేం గొప్పగా గర్విస్తాం. సినిమా అనుభవాన్ని ఉన్నతీకరించే ఉమ్మడి లక్ష్యం కోసం నెస్లే ప్రొఫెషనల్‌తో భాగస్వామి అయినందుకు మేం గర్విస్తున్నాం. నెస్లే ప్రొఫెషనల్ ఎన్నో రకాల పానీయాల శ్రేణిని అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ ఏదో ఉంది. మా పోషకులు అపారమైన లాభాలను పొందుతారని, వారి చలనచిత్ర వీక్షణ అనుభవం ఈ అనుబంధం ద్వారా ఒక మెట్టు పెరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.