గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (12:31 IST)

Union Budget 2022: 60 లక్షల ఉద్యోగాలు.. నిర్మలా సీతారామన్

కరోనా వైరస్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని, వ్యాక్సినేషన్ క్యాంపైన్ బాగా పనిచేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సవాళ్లను ఎదుర్కొనే స్థితిలో ఉన్నామని తెలిపారు. 
 
డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్‌తో 16 సెక్టార్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు.
 
రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించామని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ గడియల్లో ఉన్నామని చెప్పారు.
 
మరో 25 ఏళ్ల విజన్‌తో తమ ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందని, రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌తో పునాది వేశామని వెల్లడించారు.