Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డ్రైవర్ రహిత కార్లకు భారత్‌లో నో ఎంట్రీ.. తేల్చి చెప్పిన గడ్కరీ

మంగళవారం, 25 జులై 2017 (08:41 IST)

Widgets Magazine
driverless car

డ్రైవర్ రహిత కార్ల(డ్రైవర్ లెస్ కార్స్)కు భారత్ నో చెప్పింది. ఇలాంటి కార్ల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, అందువల్ల ఈ తరహా కార్లను అనుమతించే ప్రసక్తే లేదని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. 
 
డ్రైవర్ లెస్ కార్లకు అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ ఓకే చెప్పింది. కాంగ్రెస్ నిర్ణయంతో వేలాది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్లకెక్కనున్నాయి. సెర్చింజన్ దిగ్గజం గూగుల్, టెక్నాలజీ దిగ్గజం ఆపిల్, రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబెర్ టెక్నాలజీస్ తదితర కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ఉత్పత్తిలో బిజిగా ఉన్నాయి.
 
కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల వేలాదిమంది డ్రైవర్లు నిరుద్యోగులయ్యే అవకాశం ఉందన్నారు. పైగా, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఈ తరహా కార్లను ఎలా అనుమతిస్తామని ఆయన తెలిపారు. 
 
అయితే, పర్యావరణ హిత, కాలుష్య రహిత ప్రజా రవాణా కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. రోడ్లమీదికి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దేశంలో ఏడాదికో జాతీయ రహదారి నిర్మించాల్సి వస్తుందన్నారు. కాబట్టి ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. అందుకోసం విద్యుత్, ఇథనాల్, బయో-డీజిల్, బయోగ్యాస్, ఎల్ఎన్‌జీ తదితర వాటితో నడిచే బస్సులను ప్రవేశపెడతామన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన మంచినీరు.. రూపాయికి ఒక గ్లాసు మంచి నీరు

దేశవ్యాప్తంగా గల రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు పరిశుభ్రమైన మంచినీటిని తక్కువ ధరలకే ...

news

రైల్వే ఫుడ్ అధ్వానంగా వుంది... కాఫీ, టీ, సూప్ తయారీకి మురికి నీటినే?: కాగ్

రైల్వే శాఖ అభివృద్ధికి, ప్రయాణీకుల రాకపోకలకు అత్యాధునిక ప్రమాణాలతో సేవలు అందిస్తున్నామని, ...

news

బ్యాంకు ఎటీఎంలు వద్దేవద్దు.. పోస్టల్ ఏటీఎంలే ముద్దు.. ఎన్ని సార్లు విత్‌డ్రా చేసినా నో చార్జీ

ఖాతాదారులను పీక్కు తింటున్న బ్యాంకుల సేవలను ఇక వదిలించుకునే బంపర్ ఆఫర్ జనం ముందుకు ...

news

ముఖేష్ అంబానీ బోనస్ ఆఫర్ .. రిలయన్స్ వాటాదారులు హ్యాపీ

తాజాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ ...

Widgets Magazine