Widgets Magazine

మీకు నడపటం చేతకాక మాంసాహారం బంద్ చేస్తారా మహరాజా

హైదరాబాద్, మంగళవారం, 11 జులై 2017 (02:30 IST)

Widgets Magazine
air india air hostesses

ఉరుము ఉరిమి మంగలం మీద పడిందంటే ఇదేమరి. ఎయిరిండియా మహారాజావారికి మహా కోపం వచ్చేసింది. ఎన్ని సర్వీసులు నడిపినా, ఎన్ని పొదుపు చర్యలు పాటించినా, ఖర్చులను ఎంత కంట్రోల్ చేసినా సంస్థ అప్పులు కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్నాయే బతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి అని మథనపడి మథనపడి చివరకు ఒక కఠోర నిర్ణయం తీసుకున్నారు. తక్కువ ధరల టిక్కెట్లతో ప్రయాణించే ప్యాసింజర్లకు మాంసాహారం కట్ చేశారు. అంతపెద్ద మహాజారావారికి తక్కువ క్లాసు వారిమీదే చూపు పడింది. గంగమ్మకు పోతరాజులాగా అన్నమాట. ఇంకేం ఇక నుంచి మీరు మా విమానాల్లో ప్రయాణించేటప్పుడు మీకు మాంసం వడ్డంచం పోండని చెప్పి చేతులు దులుపుకుంది. అది కూడా దేశీయ విమానాల్లోనే అట. ఎయిరిండియా తన అప్పుల భారం తగ్గించుకునేందుకు ఎన్నుకున్న పరిష్కారం ఇదన్నమాట.
 
దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించబోమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా పేర్కొంది. ఇకపై కేవలం శాకాహారం మాత్రమే అందిస్తామని తెలిపింది. అంతర్జాతీయ విమానాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. ‘గత రెండు వారాల నుంచే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించడం లేదు’ అని సంబంధిత అధికారి చెప్పారు. 
 
కాగా ఎయిరిండియాకు రూ. 52వేల కోట్ల వరకు అప్పులున్నాయి. దీంతో సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే ప్రైవేటీకరణ బారినుంచి ఎయిరిండియాను కాపాడుకునేందుకు ఉద్యోగులు ఖర్చు తగ్గింపు ప్రణాళికలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఆలస్యంగా రావడంలో ఆ రైలు ఫస్ట్...

దేశంలో నడిచే రైళ్లు సమయానికి రావు అనే అపవాదు ఉంది. దీన్ని మరింతగా రుజువు చేసేలా ఓ ట్రైన్ ...

news

పెట్రోలు, డీజిల్ కార్లు కొనకండి స్వాములూ.. 750 కిలోమీటర్లు నడిచే సోలార్ కార్లొస్తున్నాయ్

జీఎస్టీ పుణ్యమా అని కార్లధరలు విపరీతంగా తగ్గుతున్నాయని పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు ...

news

జీఎస్టీ ఎఫెక్ట్... సెంచరీ కొట్టిన టొమాట ధర

దేశవ్యాప్తంగా టొమాట ధరలు ఆకాశానికి తాకాయి. ప్రధాన మెట్రో నగరాల్లోనే కాకుండా దేశ ...

news

షాపింగ్ మాల్స్, ఐమ్యాక్స్‌ల్లో నిలువుదోపిడీ ఇకనైనా ఆగేనా.. కేంద్రం కొరడా నిజంగానే తగిలేనా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దాని పూర్తి అర్థంలో నిజంగా ...