బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (10:48 IST)

అప్పుల్లో ఎయిరిండియా.. ఇక ప్రయాణీకులకు అందించే భోజనాల్లో సూప్ కట్

ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో నానా తంటాలు పడుతోంది. కోట్లాది రూపాయలు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా.. ఖర్చులు తగ్గించే దిశగా రంగం సిద్ధం చేసుకుంటోంది. అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్

ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో నానా తంటాలు పడుతోంది. కోట్లాది రూపాయలు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా.. ఖర్చులు తగ్గించే దిశగా రంగం సిద్ధం చేసుకుంటోంది. అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు అందించే భోజనాల్లో సూప్‌కు పుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. దీంతో పాటు కొన్ని మ్యాగజైన్లను అందుబాటులోకి తేనుంది. 
 
ఎయిరిండియాకు చెందిన శుభయాత్ర మ్యాగజైన్‌ కాపీలను వుంచాలని ప్లాన్ చేస్తోంది. అలాగే కాక్‌పిట్ డోర్ కర్టెన్‌ను కూడా తొలగించాలని భావిస్తోంది. ఇలాంటి చిన్నచిన్న పనుల వల్ల ఖర్చు తగ్గించవచ్చునని ఎయిర్ఇండియా భావిస్తోంది.
 
1980ల్లో అమెరికా విమానయాన సంస్థ ఒకటి భోజనంలో ఆలివ్ ఆయిల్‌ను తొలగించడం వల్ల ఏడాదికి లక్ష డాలర్లను ఆదా చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా కూడా సూప్‌ను మెనూ నుంచి కట్ చేయడం ద్వారా అప్పుల నుంచి విముక్తి పొందవచ్చునని భావిస్తోంది.