బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (19:09 IST)

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఎగబడుతున్నారు: రెండ్రోజుల్లోనే రూ.1,100 కోట్ల సేల్స్

లీటర్ ఆయిల్ ధర సెంచరీ దాటేసింది. దీనితో ఇప్పుడు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎగబడుతున్నారు. ఈ టైంలో ఓలా తన ఎలక్ట్రిక్ స్టూటర్లను విడుదల చేసింది. అసలే ఆయిల్ దెబ్బకి కుదేలవుతున్న సగటుజీవి కరెంటు బైకు కోసం పరుగులు పెడుతున్నాడు. దీని ఫలితమే రెండ్రోజుల కిందటే తమ బ్రాండ్ స్కూటర్ల అమ్మకాలను ప్రారంభించిన ఓలా, రికార్డు స్థాయి సేల్స్‌తో విజృంభిస్తోంది.
 
ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో అమ్మకాలు ప్రారంభించిన మొదటిరోజే ఏకంగా రూ.600 కోట్ల విలువైన అమ్మకాలతో అదుర్స్ అనిపించింది. రెండవరోజు కూడా దాని స్పీడు అలాగే సాగింది. దీనితో రెండ్రోజుల్లోనే రూ.1,100 కోట్ల విలువైన సేల్స్ మార్క్‌ను ఓలా లాగేసింది.