శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (16:17 IST)

ఓలా-ఉబెర్‌లు మెర్జ్ అవుతాయా? భారత మార్కెట్ నుంచి వెళ్లవట..!

ola cabs
ఓలా- ఉబర్‌లు మెర్జ్‌ అవుతున్నాయనే వార్తలను ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్ కొట్టి పారేశారు. "అబ్సిల్యూట్ రబిష్" ఓలా లాభాల్ని గడిస్తుంది. అదే సమయంలో వృద్ధి సాధిస్తుంది. కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశం నుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! మెర్జ్‌ అయ్యే అవకాశం లేదని ఖండించారు.
 
మరో రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఉబర్‌ భారత్‌లో తన కార్యకలాల్ని నిలిపివేస్తున్నట్లు బ్లూం బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది. ఈ కథంపై ఉబర్‌ సీఈవో డార ఖోస్రోషి స్పందించారు. భారత్‌లో రైడ్‌ షేరింగ్‌ మార్కెట్‌ ఎలా ఉందో మాకు బాగా తెలుసు. భారత్‌ నుంచి మేం వెళ్లి పోవడం లేదని, కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్లు బ్లూం బెర్గ్‌కు ఇప్పటికే చెప్పామని స్పష్టం చేశారు.