గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (22:46 IST)

ఉడాన్‌ పైన కోటి రూపాయల వ్యాపార లావాదేవీలను నిర్వహించిన 250కు పైగా విక్రేతలు

మహమ్మారి కారణంగా వ్యాపారాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ భారతదేశంలో అతిపెద్ద బీ2బీ ఈ-కామర్స్‌ వేదిక ఉడాన్‌ మాత్రం 250 మంది లైఫ్‌స్టైల్‌ విక్రేతలు దాదాపు కోటి రూపాయల విలువైన అమ్మకాలను 2020లో చేసేందుకు తోడ్పడింది. ఈ లైఫ్‌స్టైల్‌ విభాగంలో వస్త్రాలు, యాక్ససరీలు, ఫుట్‌వేర్‌ వంటివి ఉన్నాయి. భారతదేశంలో మొత్తంమ్మీద ఉన్న లైఫ్‌స్టైల్‌ రిటైలర్లలో 20% మందికి 230 మిలియన్‌ ఉత్పత్తులను వీరు సరఫరా చేశారు.
 
లైఫ్‌స్టైల్‌ విభాగం పనితీరు గురించి ఉడాన్‌, లైఫ్‌స్టైల్‌ బిజినెస్‌ హెడ్‌ కుమార్‌ సౌరభ్‌ మాట్లాడుతూ, ‘‘అంతర్జాతీయంగా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ భారత్‌ వ్యాప్తంగా చిరు వ్యాపార జీవితచక్రం ఆగకుండా ముందుకు వెళ్లేందుకు ఉడాన్‌ తోడ్పడింది.
 
లైఫ్‌స్టైల్‌ బిజినెస్‌లో వృద్ధి చెందిన సంఖ్యలకు ప్రధానకారణం నాణ్యమైన ఉత్పత్తులు అత్యంత అందుబాటు ధరలో లభించడం. ఈ వ్యాపార వృద్ధి స్పష్టంగా జీవనశైలి వ్యాపార సామర్థ్యం వెల్లడిస్తుంది. సాంకేతికతపై ఆధారపడి వాణిజ్య పర్యావరణ వ్యవస్ధను సమూలంగా మార్చాలన్న మా లక్ష్యంకు అనుగుణంగా ఇది ఉంటుంది’’ అని అన్నారు.