శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (10:29 IST)

మరోమారు బాదుడు... తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోమారు పెరిగాయి. ముఖ్యంగా, ఈ ధరల బాదుడు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. పెట్రోల్‌ ధరకు ఏమాత్రం తీసిపోని విధంగా డీజిల్ ధరలు కూడా పోటీపడి పెరుగుతున్నాయి. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. గురువారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.50గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.97.68గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.64గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.80గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.50ఉండగా.. డీజిల్ ధర రూ.97.68గా ఉంది. 
 
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే, విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.106.37కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.26లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.105.47వుండగా, డీజిల్ ధర రూ.98.16గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98.50గా ఉంది. 
 
కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.90 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.15గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 106.66 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.26 లకు లభిస్తోంది.
 
ఇకపోతే, దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.100.56గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.62 లకు లభిస్తోంది. ఇదేసమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.59కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.18గా ఉంది. 
 
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.100.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ.92.65 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.37ఉండగా.. డీజిల్ ధర రూ.94.15గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.99గా ఉంది.