శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (08:56 IST)

11వ సారి... మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు : వాహనదారులు బెంబేలు...

దేశంలో పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇలా పెరగడం ఇది వరుసగా 11వ రోజు. ధరల పెంపు విషయంలో చమురు కంపెనీలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 మార్క్‌ను దాటాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం పెట్రోల్‌పై 33 నుంచి 35 పైసలు, డీజిల్‌పై 31 పైసలు ధర పెరిగింది. 
 
తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.90.19, డీజిల్‌ రూ.80.60కి చేరింది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.96.62, హైదరాబాద్‌లో రూ.93.45కి చేరింది. విజయవాడలో రూ.96.16, కోల్‌కతాలో రూ.91.41 , చెన్నైలో రూ.92.25, బెంగళూరులో రూ.92.85కి చేరింది. 
 
ఇకపోతే, డీజిల్‌ లీటర్ ధర ముంబైలో డీజిల్ ధర రూ.87.67, హైదరాబాద్‌లో రూ. 87.55, విజయవాడలో రూ.89.69, కోల్‌కతాలో రూ.84.19, చెన్నైలో రూ.85.63, బెంగళూరులో రూ.85.06కి చేరింది. 
 
గత 11 రోజులుగా చమురు కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తూ వస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు రోడ్లపైకి వాహనాలు తీయాలంటేనే బెంబేలెత్తుతున్నారు. గడిచిన 50 రోజుల్లో 23 సార్లు చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచాయి. ఈ ఏడాదిలో లీటర్‌పై రూ.7 వరకు పెంచాయి.