శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (16:46 IST)

దేశంలో మరోమారు పెరగనున్న పెట్రో ఉత్పత్తుల ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధరలు పెగుతున్నాయి. దీంతో స్వదేశీయంగా కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 4 నెలల గరిష్టానికి చేరిన తరుణంలో దేశవాళీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచవచ్చని సమాచారం. 
 
కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ప్రస్తుతం 65.37 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మార్చి తర్వాత బ్యారల్ క్రూడాయిల్ ధర ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. కాగా, అప్పటి నుంచి ముడి చమురు ధర 9 డాలర్ల మేరకు పెరిగింది. మరో నెల రోజుల వ్యవధిలో ఈ ధర 70 డాలర్ల వరకూ చేరవచ్చని అంచనా వేస్తున్నట్టు అనలిస్టులు వ్యాఖ్యానించారు. ఈ నెల ఆరంభంలో పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిన సంగతి తెలిసిందే.