మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (10:09 IST)

వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. 11 రోజుల్లో..?

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో సామాన్య ప్రజలపై పెరుగుతున్న ధరలు షాకిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిన తరుణంలో తాజాగా పెట్రోల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు బండి బయటకు తీయాలంటే.. ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వరుసగా కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో బుధవారం చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 55 పైసలు, డీజిల్‌పై 60 పైసలు పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గడిచిన 11 రోజుల్లో ఏకంగా పెట్రోల్‌పై రూ. 6, డీజిల్ రూ. 6.40 వరకు పెరగడం గమనార్హం.
 
తాజా ధరలతో తెలుగు రాష్ట్రాల్ల్లో పెట్రోల్ ధర రూ. 80.22కు చేరగా.. డీజిల్ ధరలు రూ. 74.07కు చేరింది. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 77.28, డీజిల్ రూ. 75.79. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 80.86, డీజిల్ రూ. 73.69 పలుకుతోంది.