శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (20:05 IST)

తక్కువ ధరలకే ప్రీ ఓన్డ్ కార్లు లభ్యం... ఎక్కడ?

పెరుగుతున్న జ‌నాభాకు, విస్త‌రిస్తున్న గృహ‌ స‌ముదాయాల‌క‌నుగుణంగా వివిధ అవ‌స‌రాల నిమిత్తం కొత్త కారు కొనుక్కోలేని మధ్యతరగతి కుటుంబాలకు ప్రీ ఓన్డ్ కార్ల మేళాలో సరసమైన ధరలకే సెకండ్ హాడ్ కార్లు అందుబాటులోకి రావడం జరుగుతుందని ఆయిల్ ఫెడ్ వీసీ మరియు ఎండీ శ్రీకాంత్‌నాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉద‌యం విజ‌య‌వాడ‌లోని మేరిస్ స్టెల్లా ఆడిటోరియంలో ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో వ‌రుణ్ గ్రూపు, కుశ‌లవ షోరూంల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప్రీ ఓన్డ్ కారు మేళా కార్యక్రామాన్ని ఆయిల్ ఫెడ్ వీసీ మరియు ఎండీ శ్రీకాంత్‌నాథ్ రెడ్డి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో మధ్యతరగతి ప్రజలకు ప్రీ ఓన్డ్ కారు మేళాలలో కొత్త కారు కొనలేని వారికి తక్కువ ధరలకే ఇక్కడ సెకండ్ హాండ్ కార్లు దొరుకుతున్నాయన్నారు. త‌న‌ కెరీర్ ప్రారంభంలో 2007లో హైద్రాబాద్‌లో ప్రీ కార్లు మేళాలలో కారు కొనుక్కున్నానన్నారు. కారణం మన బడ్జెట్‌కు అనుగుణంగా ఇక్కడ తక్కువ ధరలకే కార్లు అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. అంతేకాకుండా మార్కెట్‌లో కూడా ఎక్కువ పోటీ నేప‌ధ్యంలో నాణ్యమైన కార్లు లభిస్తున్నాయని తెలిపారు. 
 
అదేవిధంగా కారు కొనుగోలు చేసే వారికి ఐసీఐసీఐ బ్యాంకు ఫైనాన్స్ అందించటంతో కార్లు గొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చేవారి సంఖ్య ఇటీవల విప‌రీతంగా పెరిగిందన్నారు. ఇలాంటి ప్రీ ఓన్డ్ కారు మేళాలతో అటు ఐసీఐసీఐ బ్యాంకు, వరుణ్ గ్రూప్‌, కుశలవ‌ గ్రూపులకు మంచి వ్యాపారం జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐసీఐసీఐ జోనల్ మేనేజర్ బి.ప్రశాంత్ సింగ్, సీనియర్ మేనేజర్ బొంగరాల వీరాస్వామి నాయుడు, జీబీజీ బ్యాంకు రీజినల్ హెడ్ వి.సుధీర్, వరుణ్, కుశ‌ల‌వ‌ ప్రతినిధులు పాల్గొన్నారు.