బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జూన్ 2017 (10:30 IST)

నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఇక తీరినట్టేనా? ప్రారంభమైన రూ.200 నోట్ల ముద్రణ

నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గతేడాది నవంబరులో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2 వేలు, రూ.500 నోట్ల

నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గతేడాది నవంబరులో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2 వేలు, రూ.500 నోట్లను తీసుకొచ్చింది. అయితే రూ.2 వేలు, రూ.500 నోట్లు ఎక్కువగా బయటకు రావడంతో చిల్లర కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. 
 
జేబులో డబ్బులున్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. కానీ తాజాగా హై సెక్యూరిటీ ఫీచర్లతో ముద్రిస్తున్న ఈ 200 నోట్లు చలామణిలోకి వస్తే ప్రజలకు చిల్లర కష్టాలు తీరినట్టేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 
 
కొన్నివారాల క్రితమే ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్‌లో వీటి ముద్రణ ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని హోషన్‌గాబాద్ ప్రభుత్వ ప్రెస్‌లో వీటి ముద్రణ జరుగుతుంది. ఆపై మైసూరు, పశ్చిమ బెంగాల్‌లోని సాల్బోనీల్లోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెస్‌ల్లో రూ.200 నోట్లను ముద్రిస్తారు.