శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 జనవరి 2016 (10:47 IST)

రాఘురామ రాజన్ దోసె సిద్ధాంతం: వారు ఎంచక్కా నాలుగు దోసెలు కొనగలరు. తినగలరు!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ రాజన్ కొత్త దోసె సిద్ధాంతాన్ని చెప్పారు. ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చి (ఎన్ సీఏఈఆర్)లో శుక్రవారం సీడీ దేశ్ ముఖ్ స్మారక ఉపన్యాసం చేసిన సందర్భంగా రఘురామ రాజన్ నోట వినిపించిన ఈ కొత్త సిద్ధాంతం ఆసక్తికరంగా సాగింది. 
 
‘ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటంతో పాటు డిపాజిట్లపై వడ్డీ రేటు ఎక్కువగా ఉండాలి. అప్పుడే పెన్షనర్ల జీవితం హాయిగా ఉంటుందని చెప్పారు. అప్పుడే వారు ఎంచక్కా నాలుగు దోసెలు కొనగలరు. తినగలరు. ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు... కొనుగోలు శక్తి పెరుగుతుందని రఘురామ రాజన్ వెల్లడించారు. 
 
ఇంకా ఒకవేళ వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ పెన్షనర్లు ఎక్కువ దోసెలు తినగలరు’’ అని రాజన్ ఆ సిద్ధాంతాన్ని వల్లె వేశారు. కాస్తంత హ్యూమరస్ గానే అనిపించినా, సామాన్యులకు కూడా ఈ సిద్ధాంతంతో ద్రవ్యోల్బణం ప్రభావం ఇట్టే అర్థమవుతోంది.