సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (18:19 IST)

ఉచిత వైఫైలో గూగుల్ వెనక్కి.. అయినా పర్లేదన్న రైల్ టెల్ (video)

ఉచిత వైఫైలో గూగుల్ వెనక్కి తగ్గింది. భారత్‌లో డేటా అత్యంత చౌకగా లభిస్తున్న తరుణంలో ఇంకా తాము ఉచితంగా వైఫై అందించడం ఎందుకని భావించిన గూగుల్ ఉచిత వైఫై కార్యక్రమానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. 
 
దీనిపై భారతీయ రైల్వే అనుబంధ సంస్థ రైల్ టెల్ స్పందించింది. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై పథకంలో గూగుల్ కేవలం 415 స్టేషన్లలో మాత్రమే భాగస్వామి అని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్న రైల్వే స్టేషన్ల సంఖ్య 5600కి చేరిందని వివరించింది. 
 
గూగుల్ తో పాటు మరికొన్ని సంస్థలు కూడా ఇందులో భాగస్వాములని, గూగుల్ వెనక్కి తగ్గినా, తాము ఇతర సంస్థల సాయంతో ఉచిత వైఫై అందించే కార్యక్రమం కొనసాగిస్తామని రైల్ టెల్ స్పష్టం చేసింది. కాగా గూగుల్ ప్రస్తుతం భారత్‌తో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయిలాండ్, ఫిలిప్పిన్స్, మెక్సికో, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు గూగుల్ రైలు వైఫై సేవలు అందిస్తోంది.