శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 19 మే 2015 (15:44 IST)

'జెన్ ఎక్స్ నానో' కారును ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ కంపెనీ

టాటా మోటార్స్ కంపెనీ నానో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 'జెన్ ఎక్స్ నానో' పేరుతో ప్రవేశపెట్టిన ఈ కారు ధర రూ.2.10 లక్షలు మాత్రమే. నానోకు ఆటోమేటిక్ వర్షన్‌గా ఈ కారును ప్రవేశపెట్టారు. మాన్యువల్ గేర్ ట్రాన్స్ మిషన్‌తో లభించే కారు అతి తక్కువ ధరతో భారత్‌లో లభించే ఆటోమేటిక్ వర్షన్ కారు ఇదేనని టాటా మోటార్స్ పేర్కొంది. 
 
కాగా, ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న‌ లో ఎండ్ ఆటోమేటిక్ కారుగా మారుతి సుజుకి ఆల్టో కే10 (ధర రూ.4.26 లక్షలు) కొనసాగుతోంది. ఇపుడు 'జెన్ ఎక్స్ నానో' రాకతో ఆ గుర్తింపు తుడిసిపెట్టుకుని పోయింది. రెండేళ్ల పాటు శ్రమించి తయారు చేసిన ఈ కారు... ఈజీ షిఫ్ట్ (ఏఎంటీ) సాంకేతికత, ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో కస్టమర్లకు కారును దగ్గరకు చేరుస్తుందని భావిస్తున్నట్టు సంస్థ తెలిపింది.