ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (13:42 IST)

ఆర్బీఐలో 303 పోస్టులు.. డిగ్రీ వుంటే అప్లై చేసుకోవచ్చు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన సర్వీసెస్‌ బోర్డు విభాగం.. గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 303 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్‌ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  
 
మొత్తం ఖాళీలు: 303 
అర్హతలు: ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
 
పే స్కేల్‌: నెలకు రూ.83,254 వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 18,2022.