1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (16:36 IST)

కొత్త వంద రూపాయల నోటుతో నకిలీ కరెన్సీకి చెక్: ఆర్బీఐ

నకిలీ కరెన్సీకి చెక్ పెట్టే దిశగా రిజర్వ్ బ్యాంకు కొత్త వంద రూపాయల నోటును ప్రవేశపెట్టింది. భారతీయ కరెన్సీకి మరిన్ని భద్రతాంశాలు జోడించింది. నకిలీ కరెన్సీల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆర్బీబి కొత్త కరెన్సీని వాడుకలోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నేడు కొత్త వంద రూపాయల నోటును విడుదల చేసింది. ఈ నోటులో ఎరుపు రంగులో ఉండే అంకెల్లో మార్పులు చేసింది. 
 
అలాగే జాతిపిత గాంధీజీ తలపై, నాలుగు సింహాల బొమ్మ ప్రక్కన ఉండే ఈ అంకెల పరిమాణంలో మార్పులు చేసింది. ఇవి చిన్న అంకెలుగా ప్రారంభమై పెద్దగా మారుతాయి. తాజా మార్పులతో నకీలీలకు బ్రేక్ పడుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. పాత నోట్లలో ఈ అంకెల పరిమాణం సమానంగా ఉంటుంది. కొత్త వాటిలో మార్పులు ఉంటాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.