సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (20:48 IST)

భారీగా పెరిగిన దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం

Inflation
Inflation
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. గత ఆగష్టు నెలతో పోల్చుకుంటే సెప్టెంబర్‌లో 0.41 శాతం అధిక ద్రవ్యోల్బణం నమోదైంది. గత ఐదు నెలల్లో ఇంత ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు ఏడు కీలక రంగాల ప్రగతిని సూచించే పారిశ్రామిక ప్రగతి రేటు 0.8 శాతం తగ్గింది. 
 
రెపో రేట్లు పెంచడంతోసహా ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ద్రవ్యోల్బణం కట్టడి కావడం లేదు. ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ఆహారోత్పత్తుల రేట్లు మండిపోతున్నాయి. ఇప్పటికే పేద, మధ్యతరగతి వారిపై తీవ్ర భారం పడుతోంది.