మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 ఆగస్టు 2022 (16:24 IST)

ఆగస్టు 10వ తేదీన కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్; కస్టమర్లు రు.1,999తో గెలాక్సీని ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు

Samsung Galaxy M13
బెంగళూరు లోని శామ్‌సంగ్ ఒపేరా హౌస్‌లో ఆగస్టు 10వ తేదీన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంటులో శామ్‌సంగ్ తన తర్వాతి తరం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయబోతున్నది. కస్టమర్లు త్వరిత ప్రాప్యత కొరకు అర్హులుగా ఉండటానికి గాను ఈవెంట్‌కు ముందుగానే తదుపరి గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ముందస్తుగా-రిజర్వు చేసుకోవచ్చు. తర్వాతి గెలాక్సీ స్మార్ట్ ఫోన్‌ని ముందస్తుగా-రిజర్వు చేసుకోవడానికి గాను, కస్టమర్లు శాంసంగ్ డాట్ కామ్ లేదా శామ్‌సంగ్ ప్రత్యేక షోరూం వద్ద టోకెన్ మొత్తం రూ. 1,999 చెల్లించాల్సి ఉంటుంది.

 
తర్వాతి గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ముందస్తుగా-రిజర్వు చేసుకున్న కస్టమర్లు, ఉపకరణం డెలివరీ చేయబడిన తర్వాత రు.5,000 ల విలువైన అదనపు ప్రయోజనాలు పొందుతారు. ఒక స్మార్ట్ ఫోన్ ఏమి చేయగలుగుతుందో అనేదానిపై శామ్‌సంగ్ సరిహద్దుల్ని చెరిపేస్తోంది. శామ్‌సంగ్ అర్థవంతమైన ఆవిష్కరణలను విశ్వసిస్తుంది. దైనందిన జీవితం సుసంపన్నం, మరింత బహుముఖమయ్యే ఒక వేదికను అందిస్తూ సాంకేతికతను అధిగమిస్తుంది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2022, ఆగస్టు 10వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు శామ్‌సంగ్ న్యూస్‌రూమ్ ఇండియాపై ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.