శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 నవంబరు 2024 (18:22 IST)

భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సామ్‌సంగ్: కౌంటర్‌పాయింట్ రీసెర్చ్‌

Samsung Galaxy A55 5G
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా డాటా ప్రకారం, 2024లో వరుసగా మూడవ త్రైమాసికంలో భారతదేశంలో విలువ ప్రకారం సామ్‌సంగ్ నంబర్ 1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ గా నిలిచింది. 2024 సంవత్సరం మూడవ త్రైమాసికంలో, భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సామ్‌సంగ్ నేతృత్వంలో అత్యధిక విలువను సాధించింది, పరిశోధనా సంస్థ తెలిపిన దాని ప్రకారం 23% మార్కెట్ వాటాను సామ్‌సంగ్ కలిగి ఉంది. 
 
“ఆకట్టుకునే ఈఎంఐ ఆఫర్‌లు, ట్రేడ్-ఇన్‌ల మద్దతు- ప్రీమియమైజేషన్ ట్రెండ్‌తో మార్కెట్ ఎక్కువగా విలువ వృద్ధి వైపు మళ్లుతోంది. సామ్‌సంగ్ ప్రస్తుతం మార్కెట్‌లో 23% వాటాతో అగ్రస్థానంలో ఉంది, దాని ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్ సిరీస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, దాని విలువ-ఆధారిత పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడం ద్వారా దాని స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. తన మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేసేందుకు, సామ్‌సంగ్ గెలాక్సీ ఏఐ  ఫీచర్లను 'ఏ' సిరీస్‌లోని మధ్య-శ్రేణి, సరసమైన ప్రీమియం మోడల్‌లలోకి అనుసంధానం చేస్తోంది, అధిక ధరల విభాగాలకు మారేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోంది,” అని సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రాచీర్ సింగ్ చెప్పారు.
 
మూడవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్, 2024) విలువ వృద్ధి ఇయర్ ఆన్ ఇయర్  ప్రాతిపదికన 12% పెరిగి ఒకే త్రైమాసికంలో ఆల్-టైమ్ రికార్డ్‌కు చేరుకుందని కౌంటర్ పాయింట్ తెలిపింది. వాల్యూమ్ పరంగా, స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇయర్ ఆన్ ఇయర్ 3% వృద్ధి చెందిందని కౌంటర్ పాయింట్ తెలిపింది.
 
కొనసాగుతున్న ప్రీమియమైజేషన్ ట్రెండ్ కారణంగా విలువ వృద్ధి నడపబడింది, అయితే పండుగ సీజన్ ప్రారంభంలోనే వాల్యూమ్ పెరుగుదల కనిపించింది. ఓఈఎంలు ముందస్తుగా ఛానెల్‌లను నింపాయి, రిటైలర్‌లు పండుగ అమ్మకాలలో ఊహించిన పెరుగుదలకు బాగా సిద్ధమయ్యారనే భరోసా ఇది అందించింది, అయినప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే పండుగ విక్రయాలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి అని  పరిశోధనా ఏజెన్సీ జోడించింది.